ఐపీఎల్-2020 వేలంలో విదేశీ హిట్టర్లు

29 బెర్త్ ల కోసం 146 మంది వేలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ వేలానికి కోల్ కతా నగరంలో రంగం సిద్ధమయ్యింది. మరికొద్ది గంటల్లో జరిగే ఈ వేలంలో మొత్తం 332 మంది స్వదేశీ,విదేశీ క్రికెటర్లు తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. కనీస వేలం ధర 50 లక్షల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయలతో వేలం నిర్వహించనున్నారు. అయితే…విదేశీ క్రికెటర్ల కోటాలో కేవలం 29 ఖాళీలు మాత్రమే భర్తీ చేయాల్సి ఉంది. అయితే..వివిధ దేశాలకు చెందిన మొత్తం […]

Advertisement
Update:2019-12-18 06:01 IST
  • 29 బెర్త్ ల కోసం 146 మంది వేలం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ వేలానికి కోల్ కతా నగరంలో రంగం సిద్ధమయ్యింది. మరికొద్ది గంటల్లో జరిగే ఈ వేలంలో మొత్తం 332 మంది స్వదేశీ,విదేశీ క్రికెటర్లు తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.

కనీస వేలం ధర 50 లక్షల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయలతో వేలం నిర్వహించనున్నారు. అయితే…విదేశీ క్రికెటర్ల కోటాలో కేవలం 29 ఖాళీలు మాత్రమే భర్తీ చేయాల్సి ఉంది.

అయితే..వివిధ దేశాలకు చెందిన మొత్తం 146 మంది ఆటగాళ్లతో వేలం జాబితాను సిద్దం చేశారు.

కంగారూ వరద…

మొత్తం 146 మంది విదేశీ క్రికెటర్ల జాబితాలో ఆస్ట్ర్రేలియాకు చెందిన 35 మంది క్రికెటర్లు వేలంలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. గ్లెన్ మాక్స్ వెల్, పాట్ కమిన్స్, మిషెల్ మార్ష్ లాంటి అంతర్జాతీయ క్రికెటర్లు 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్ తో పోటీకి దిగుతున్నారు.

సౌతాఫ్రికాకు చెందిన 23, ఇంగ్లండ్ కు చెందిన 22, వెస్టిండీస్ 19, న్యూజిలాండ్ 18, శ్రీలంక 14, అప్ఘనిస్థాన్ 7, బంగ్లాదేశ్ 5, అమెరికా, యూఏఈ, స్కాట్లాండ్ దేశాలకు చెందిన ఒక్కో ఆటగాడికి వేలం తుది జాబితాలో చోటు దక్కింది. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు 29 మంది విదేశీ క్రికెటర్ల స్థానాలను భర్తి చేసుకోవాల్సి ఉంది.

హాట్ కేకులు…..

విదేశీ క్రికెటర్లలో సూపర్ హిట్టర్లు గ్లేన్ మాక్స్ వెల్, షిమ్రోన్ హెట్ మేయర్, జేసన్ రాయ్, క్రిస్ లిన్, సామ్ కరెన్, డేవిడ్ మిల్లర్ ల వైపు ఫ్రాంచైజీలు చూస్తున్నాయి.

ఒంటిచేత్తో ఆట స్వరూపాన్ని మార్చివేయగల ఆరుగులు ప్రధాన క్రికెటర్ల వైపే వివిధ ఫ్రాంచైజీలు గురిపెట్టాయి. ఎంత ధరకైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాయి.

ఐపీఎల్ వేలం చరిత్రలో ఇప్పటి వరకూ అత్యధికంగా 12 కో్ట్ల 50 లక్షల రూపాయల ధర దక్కించుకొన్న రికార్డు ఇంగ్లండ్ సూపర్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పేరుతో ఉంది.

Tags:    
Advertisement

Similar News