న్యూ ఇయర్‌కు ముందే మందుబాబులకు షాక్ !
తెలంగాణలో లిక్కర్ ధరలు పెరిగాయి. అన్ని రకాల మద్యం ధరలు 10 శాతం పెరిగాయి. క్వార్టర్ నుంచి పుల్ బాటిల్ వరకు 20 నుంచి 80 రూపాయలు పెరిగింది. బీరు ధరను 10 నుంచి 20 రూపాయల వరకు పెంచినట్లు ఆబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. పాత నిల్వలకు ధరల పెంపు వర్తించదని సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. మద్యం ధరల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.300 కోట్ల […]
తెలంగాణలో లిక్కర్ ధరలు పెరిగాయి. అన్ని రకాల మద్యం ధరలు 10 శాతం పెరిగాయి. క్వార్టర్ నుంచి పుల్ బాటిల్ వరకు 20 నుంచి 80 రూపాయలు పెరిగింది. బీరు ధరను 10 నుంచి 20 రూపాయల వరకు పెంచినట్లు ఆబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి.
పాత నిల్వలకు ధరల పెంపు వర్తించదని సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. మద్యం ధరల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు అదనపు ఆదాయం రానుంది.
లైట్ బీరు 20 రూపాయలు పెరిగితే… స్ట్రాంగ్ బీరుపై పది రూపాయలు వడ్డించారు.
ఇటు క్వార్టర్ 20 రూపాయలు పెరిగితే.. హాఫ్ 40 రూపాయలు..పుల్ బాటిల్ ఏకంగా 80 రూపాయలు పెంచారు. మొత్తానికి న్యూయర్ సేల్స్‌కు ముందే లిక్కర్ ధరలు పెరిగాయి. ఈ నెలలో ఆదాయం పెరుగుతుందని అబ్కారీ శాఖ అంచనా.
బ్రాండ్ సైజు ప్రస్తుతం పెరిగిన రేటు
సిగ్నేచర్ క్వార్టర్ 250 270
హాఫ్ 490 530
పుల్ 980 1060
బడ్వైజర్ బీరు 150 180
కింగ్ ఫిషర్ లైట్ 100 120
కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ 120 130