బుట్టా రేణుకకు ఆ పదవి ఇస్తారా?

బుట్టా రేణుక. కర్నూలు మాజీ ఎంపీ. వైసీపీ తరపున 2014లో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె…ఫస్ట్‌ టైమ్‌ వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఆమె సంచలనం సృష్టించారు. ఆయితే ఆమె తర్వాత టీడీపీలో చేరారు. చివరకు ఎన్నికల ముందు తిరిగి వైసీపీలో చేరారు. కర్నూలు ఎంపీ టికెట్‌ లేదా ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్‌ ఇస్తామని చెబితే బుట్టా టీడీపీలో చేరారు. కానీ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆమె తిరిగి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేశారు. […]

Advertisement
Update:2019-12-17 02:09 IST

బుట్టా రేణుక. కర్నూలు మాజీ ఎంపీ. వైసీపీ తరపున 2014లో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె…ఫస్ట్‌ టైమ్‌ వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఆమె సంచలనం సృష్టించారు. ఆయితే ఆమె తర్వాత టీడీపీలో చేరారు. చివరకు ఎన్నికల ముందు తిరిగి వైసీపీలో చేరారు.

కర్నూలు ఎంపీ టికెట్‌ లేదా ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్‌ ఇస్తామని చెబితే బుట్టా టీడీపీలో చేరారు. కానీ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆమె తిరిగి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేశారు. కర్నూలు పార్లమెంట్‌ పరిధిలో అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు.

ఎన్నికల తర్వాత ఆమెకు ఏదో ఒక పదవి వస్తుందని…. ఇస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. పార్టీలో చేరినపుడే ఆమె ఎలాంటి షరతులు పెట్టలేదు. దీంతో ఇప్పుడు ఆమె పదవులు అడిగేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

ఎమ్మెల్సీ లేదా రాజ్యసభకు ఆమెను జగన్‌ ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆమె తన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారు. పార్టీ ఫ్లాట్‌ఫామ్‌లపై కనిపించడం లేదు. హైదరాబాదులోని మెరీడియన్ స్కూల్ ల నిర్వహణను తనే స్వయంగా చూసుకుంటున్నారు. ప్రస్తుతం కొడుకు పెళ్లి వ్యవహారాలలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

అయితే కొడుకు పెళ్లి తర్వాత ఆమె తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాజకీయాలకు కొంత గ్యాప్‌ ఇచ్చామని… పూర్తిగా తప్పుకోలేదని ఆమె సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ ను తప్ప మరొకరిని నమ్మను అని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం.

Tags:    
Advertisement

Similar News