నాపై జరుగుతున్న ట్రోల్ నుంచే దిశ యాక్ట్ అమలు చేయండి...
రాష్ట్రంలో మద్యానికి సంబంధించిన పలు బ్రాండ్స్ అందుబాటులో లేకుండా చేశారంటూ అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలపై ట్రోల్ చేస్తున్న వారి పట్ల టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం గురించి తాను మాట్లాడితే స్పీకర్‌తో పాటు పలువురు సభ్యులు మీకెందుకు ఆ సబ్జెక్ట్ అంటూ మాట్లాడారని ఆమె విమర్శించారు. కానీ మహిళనైనంత మాత్రాన తాను మాట్లాడకూడదా అని నిలదీశారు. ఈ అంశంలో తనపై కొందరు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అనుచితంగా వ్యాఖ్యలు […]
రాష్ట్రంలో మద్యానికి సంబంధించిన పలు బ్రాండ్స్ అందుబాటులో లేకుండా చేశారంటూ అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలపై ట్రోల్ చేస్తున్న వారి పట్ల టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం గురించి తాను మాట్లాడితే స్పీకర్‌తో పాటు పలువురు సభ్యులు మీకెందుకు ఆ సబ్జెక్ట్ అంటూ మాట్లాడారని ఆమె విమర్శించారు. కానీ మహిళనైనంత మాత్రాన తాను మాట్లాడకూడదా అని నిలదీశారు.
ఈ అంశంలో తనపై కొందరు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అనుచితంగా వ్యాఖ్యలు చేశారని ఆమె సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ పరిస్థితిని చూసి తన కుటుంబసభ్యులు బాధపడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. తనపై అనుచితంగా పోస్టులు పెట్టిన వారికి సంబంచింది అన్ని ఆధారాలు ఉన్నాయని… వాటిని తాను స్పీకర్‌కు అందజేస్తానని చెప్పారు. తానిచ్చిన ఆధారాలతో సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మహిళలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారని… దిశ యాక్ట్‌లో కూడా సోషల్ మీడియాలో మహిళలను వేధిస్తే రెండేళ్లు జైలు శిక్ష విధిస్తామని చెప్పారని.. కాబట్టి తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైనే తొలుత దిశ యాక్ట్‌ను ప్రయోగించాలని భవానీ కోరారు.