తొలివన్డేలో భారత్ కు వెస్టిండీస్ షాక్

చెన్నైలో హెట్ మేయర్ సూపర్ హిట్ ప్రపంచ రెండో ర్యాంకర్ భారత్ తో తీన్మార్ సిరీస్ లోని తొలివన్డేలో 9వ ర్యాంకర్ వెస్టిండీస్ సంచలన విజయం సాధించింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ముగిసిన హైస్కోరింగ్ పోరులో కరీబియన్ టీమ్ 8 వికెట్ల తేడాతో భారత్ ను చిత్తు చేసి 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ పోరులో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న విండీస్ ప్రత్యర్థి భారత్ ను 8 వికెట్లకు 287 పరుగుల స్కోరుకే […]

Advertisement
Update:2019-12-16 04:20 IST
  • చెన్నైలో హెట్ మేయర్ సూపర్ హిట్

ప్రపంచ రెండో ర్యాంకర్ భారత్ తో తీన్మార్ సిరీస్ లోని తొలివన్డేలో 9వ ర్యాంకర్ వెస్టిండీస్ సంచలన విజయం సాధించింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ముగిసిన హైస్కోరింగ్ పోరులో కరీబియన్ టీమ్ 8 వికెట్ల తేడాతో భారత్ ను చిత్తు చేసి 1-0 ఆధిక్యం సంపాదించింది.

ఈ పోరులో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న విండీస్ ప్రత్యర్థి భారత్ ను 8 వికెట్లకు 287 పరుగుల స్కోరుకే పరిమితం చేసింది.

ఓపెనర్ రోహిత్ శర్మ, రాహుల్, కెప్టెన్ కొహ్లీ విఫలమైనా…శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, మిడిలార్డర్ ఆటగాడు కేదార్ జాదవ్ ధూమ్ ధామ్ బ్యాటింగ్ తో భారత్ ప్రత్యర్థి ఎదుట 288 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచగలిగింది.

కరీబియన్ ఫాస్ట్ బౌలర్ కోట్రేల్ 2వికెట్లు పడగొట్టాడు. సమాధానంగా భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన విండీస్ 47.5 ఓవర్లలో కేవలం 2వికెట్ల నష్టానికే విజయాన్ని సొంతం చేసుకోగలిగింది.

డబుల్ ధమాకా…

వెస్టిండీస్ ఓపెనర్ హోప్, వన్ డౌన్ హెట్ మేయర్ రెండో వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో మ్యాచ్ ను ఏకపక్షంగా ముగించగలిగారు. వన్ డౌన్ షమ్రాన్ హెట్ మేయర్ 106 బాల్స్ లో 11 బౌండ్రీలు, 7 సిక్సర్లతో 139 పరుగులు సాధించి అవుటయ్యాడు. వన్డే క్రికెట్లో హెట్ మేయర్ కు ఇది 5వ శతకం కావడం విశేషం.

మరోవైపు..ఓపెనర్ షైయ్ హోప్ బాధ్యతాయుతంగా ఆడి 151 బాల్స్ లో 7 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 102 పరుగులతో అజేయంగా నిలిచాడు.

భారత బౌలర్లలో షమీ, చహార్ చెరో వికెట్ పడగొట్టారు. విండీస్ విజయంలో ప్రధానపాత్ర వహించిన హెట్ మేయర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని రెండో వన్డే విశాఖ వేదికగా ఈనెల 18న జరుగుతుంది.

భారత్- విండీస్ జట్లు ఇప్పటి వరకూ 131 వన్డేలలో తలపడితే…కరీబియన్ టీమ్ కు ఇది 64వ గెలుపు కావడం విశేషం. భారత్ పై విండీస్ 64-63 విజయాల రికార్డుతో ఉంది.

Tags:    
Advertisement

Similar News