చెన్నై వేదికగా భారత్- విండీస్ తొలివన్డే

చెపాక్ లో మరికాసేపట్లో సమరం ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్, వెస్టిండీస్ జట్లు…మరో వన్డే సిరీస్ సమరానికి సై అంటే సై అంటున్నాయి. 2019 సీజన్ ఆఖరి సిరీస్ తీన్మార్ సిరీస్ లో భాగంగా మరికాసేపట్లో ప్రారంభమయ్యే తొలి సమరానికి చెన్నై చెపాక్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. నాలుగుమాసాల తర్వాత… నాలుగుమాసాల విరామం తర్వాత తొలివన్డే సిరీస్ కు సిద్ధమైన 2వ ర్యాంకర్ భారత్…9వ ర్యాంకర్ విండీస్ ను మరోసారి చిత్తు చేయటానికి ఉరకలేస్తోంది. వెస్టిండీస్ ప్రత్యర్థిగా గత తొమ్మిది […]

Advertisement
Update:2019-12-15 03:18 IST
  • చెపాక్ లో మరికాసేపట్లో సమరం

ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్, వెస్టిండీస్ జట్లు…మరో వన్డే సిరీస్ సమరానికి సై అంటే సై అంటున్నాయి. 2019 సీజన్ ఆఖరి సిరీస్ తీన్మార్ సిరీస్ లో భాగంగా మరికాసేపట్లో ప్రారంభమయ్యే తొలి సమరానికి చెన్నై చెపాక్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

నాలుగుమాసాల తర్వాత…

నాలుగుమాసాల విరామం తర్వాత తొలివన్డే సిరీస్ కు సిద్ధమైన 2వ ర్యాంకర్ భారత్…9వ ర్యాంకర్ విండీస్ ను మరోసారి చిత్తు చేయటానికి ఉరకలేస్తోంది.

వెస్టిండీస్ ప్రత్యర్థిగా గత తొమ్మిది ద్వైపాక్షిక సిరీస్ ల్లో నెగ్గుతూ వచ్చిన భారతజట్టు…వరుసగా 10 వ సిరీస్ విజయానికి ఉరకలేస్తోంది.

వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా జరుగుతున్న సిరీస్ ల పరంపరలో ఇది ఒకటిగా ఉన్నా.. ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోయింది.

సమఉజ్జీలు భారత్- విండీస్…

ప్రపంచ టైటిల్ ను చెరో రెండుసార్లు నెగ్గిన భారత్, విండీస్ జట్లు…ఫేస్ టు ఫేస్ రికార్డుల్లో సైతం సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఆడిన 130 వన్డేల్లో రెండుజట్లకూ 62 విజయాల చొప్పున ఉన్నాయి. రెండుమ్యాచ్ లు టైగా ముగిస్తే…మరో మూడుమ్యాచ్ లకు ఫలితం తేలకుండానే తెరపడింది.

మరోవైపు కిరాన్ పోలార్డ్ నాయకత్వంలోని విండీస్ జట్టు…ఇటీవలే అప్ఘనిస్థాన్ తో జరిగిన వన్డే సిరీస్ లో నెగ్గడం ద్వారా…గత ఐదేళ్ల కాలంలో తొలి వన్డే సిరీస్ విజయం స్ఫూర్తితో భారత్ కు గట్టి పోటీ ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది.

కెప్టెన్ పోలార్డ్, హెట్ మేయర్, ఇవిన్ లూయిస్, నికోలస్ పూరన్, లెండిల్ సిమ్మన్స్, షియా హోప్ లాంటి సూపర్ హిట్టర్లతో విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ సమతూకంతో కనిపిస్తోంది.

నంబర్ -4 గా శ్రేయస్ అయ్యర్…

రోహిత్ శర్మ, మయాంక్ అగర్వార్, రాహుల్, రోహిత్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రవీంద్ర జడేజా, శివం దూబే లాంటి పవర్ హిట్టర్లతో కూడిన భారతజట్టును గత కొద్ది సంవత్సరాలుగా వెంటాడుతున్న రెండోడౌన్ సమస్య ప్రస్తుత సిరీస్ తో తీరిపోనుంది.

శ్రేయస్ అయర్ నాలుగోస్థానంలోనూ, రిషభ్ పంత్ 5వ నంబర్ గాను బ్యాటింగ్ కు దిగటం ఖాయంగా కనిపిస్తోంది.
సుదీర్ఘవిరామం తర్వాత… వివాదాలకు కేంద్రబిందువుగా మారిన చెన్నై చెపాక్ స్టేడియం సుదీర్ఘ విరామం తర్వాత..తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కు సిద్ధమయ్యింది.

ఈ పోరుకు అభిమానులు భారీసంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. సూపర్ సండే ఫైట్ గా జరుగనున్న ఈ పోటీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.

Tags:    
Advertisement

Similar News