విద్యుత్ చార్జీలు పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం
ఆర్టీసీ చార్జీలను ఇటీవల పెంచిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ చార్జీలను పెంచేందుకు సిద్ధమవుతోంది. మూడేళ్లుగా చార్జీలు పెంచకపోవడం, నష్టాలు పెరుగుతున్న నేపథ్యంలో…. డిస్కంలను గట్టెక్కించేందుకు ధరలు పెంచక తప్పదని తెలంగాణ విద్యుత్ అధికారులు చెబుతున్నారు. పెంపు దాదాపు ఖాయమంటున్నారు. విద్యుత్ చార్జీల పెరుగుదల 8 శాతం నుంచి 10 శాతం వరకు ఉంటుందని చెబుతున్నారు. దాదాపు అన్ని స్లాబుల్లోనూ చార్జీలు పెంచే అవకాశం ఉంది. చార్జీల పెంపు ఆలోచన నేపథ్యంలో వార్షిక నివేదికను అందజేసేందుకు మరికొంత […]
ఆర్టీసీ చార్జీలను ఇటీవల పెంచిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ చార్జీలను పెంచేందుకు సిద్ధమవుతోంది. మూడేళ్లుగా చార్జీలు పెంచకపోవడం, నష్టాలు పెరుగుతున్న నేపథ్యంలో…. డిస్కంలను గట్టెక్కించేందుకు ధరలు పెంచక తప్పదని తెలంగాణ విద్యుత్ అధికారులు చెబుతున్నారు. పెంపు దాదాపు ఖాయమంటున్నారు.
విద్యుత్ చార్జీల పెరుగుదల 8 శాతం నుంచి 10 శాతం వరకు ఉంటుందని చెబుతున్నారు. దాదాపు అన్ని స్లాబుల్లోనూ చార్జీలు పెంచే అవకాశం ఉంది.
చార్జీల పెంపు ఆలోచన నేపథ్యంలో వార్షిక నివేదికను అందజేసేందుకు మరికొంత సమయం కావాలని తెలంగాణ ఈఆర్‌సీని ట్రాన్స్‌కో కోరింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చర్చలు పూర్తయి… విద్యుత్ చార్జీల పెంపుకు గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాతే చార్జీల పెంపు ప్రతిపాదనలతో పాటు ఈఆర్‌సీకి నివేదిక ఇవ్వనున్నారు.
ఈ ఏడాది సబ్సిడీల కింద ప్రభుత్వం 5వేల కోట్లు ట్రాన్స్‌కోకు చెల్లించింది. వచ్చే ఏడాది ఆ సబ్సిడీ భారం 8వేల కోట్లకు చేరుతుందని అంచనా. 100 యూనిట్ల కంటే తక్కువ వినియోగించే గృహాలకు యూనిట్‌కు 1.45రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారు. ఈ చార్జీలు చాలా ఏళ్లుగా పెంచడం లేదు.
ఈ నేపథ్యంలో ఈ స్లాబ్ ధరలు కూడా పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు వాడే విద్యుత్ చార్జీలను కూడా పెంచాలని ట్రాన్స్‌కో సిఫార్సు చేస్తోంది.