కృష్ణాజిల్లాలో టన్ను ఇసుక గరిష్ట ధర రూ. 725, కనిష్ట ధర రూ. 375
రాష్ట్రంలో ఇసుక సరఫరా గాడిన పడింది. డిమాండ్‌కు తగ్గట్టుగానే ఇసుక అందుబాటులో ఉంది. బుకింగ్ చేసుకున్న 24గంటల్లోనే ఇసుకను వినియోగదారులకు అందిస్తున్నారు. ఇసుక అక్రమాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్ 14500 మంచి ఫలితానిస్తోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇసుక ఉచితమన్నప్పటికీ…. దాన్ని ఆసరగా చేసుకుని టీడీపీ నేతలు కోట్లు కొల్లగొట్టారు. ఇసుక రీచ్‌లను తమ ఆధీనంలో ఉంచుకుని ఎమ్మెల్యేలు వందల కోట్లకు పడగలెత్తారు. ఆ దెబ్బకు టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. చంద్రబాబు వైఫల్యాన్ని పరిగణనలోకి […]
రాష్ట్రంలో ఇసుక సరఫరా గాడిన పడింది. డిమాండ్‌కు తగ్గట్టుగానే ఇసుక అందుబాటులో ఉంది. బుకింగ్ చేసుకున్న 24గంటల్లోనే ఇసుకను వినియోగదారులకు అందిస్తున్నారు. ఇసుక అక్రమాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్ 14500 మంచి ఫలితానిస్తోంది.
గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇసుక ఉచితమన్నప్పటికీ…. దాన్ని ఆసరగా చేసుకుని టీడీపీ నేతలు కోట్లు కొల్లగొట్టారు. ఇసుక రీచ్‌లను తమ ఆధీనంలో ఉంచుకుని ఎమ్మెల్యేలు వందల కోట్లకు పడగలెత్తారు. ఆ దెబ్బకు టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.
చంద్రబాబు వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకున్న జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక అమ్మకాలను ప్రభుత్వమే చేపట్టింది. దీంతో ఆదాయం నేరుగా ప్రభుత్వానికే వస్తోంది. ఇసుక మాఫియా మట్టికొట్టుకుపోయింది.
ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నా… మాఫియాకు అడ్డుకట్ట పడినా ధరలు మాత్రం కాస్త ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కృష్ణా జిల్లాలో టన్ను ఇసుక ధర 725 రూపాయలుగా ఉంది. నూజివీడు స్టాక్ యార్డులో ఈ గరిష్ట ధర చెల్లించాల్సి వస్తోంది. తిరువూరు, కంచల యార్డులో మాత్రం 375 రూపాయలకు టన్ను ఇసుక లభిస్తోంది.
గుడివాడలో రూ. 585, మచిలీపట్నంలో 650, కానురులో 625, భవానీపురంలో 625 రూపాయలకు టన్ను ఇసుక అమ్ముతున్నారు. ఇసుకను కావాల్సిన మేరకు అన్ని నియోజకవర్గాల్లోని స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉంచామని కలెక్టర్ చెప్పారు. రవాణా సమయంలో అధిక ధర వసూలు చేయకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.