నెల్లూరును మాఫియాలకు అప్పగించారు " వైసీపీ ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు

సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు నగరాన్ని మాఫియా చేతుల్లో పెట్టారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మాఫియాలకు అడ్డుకట్ట వేసేంత ధైర్యం పోలీసులకు ఉన్నా… వారి ఉద్యోగ భద్రత గురించి ఆలోచించి అడుగు ముందుకేయలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో నలుగురు ఎస్పీలను మార్చడం బట్టి ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. నెల్లూరులో ఐదేళ్లలో మాఫియా ఆగడాలు రెట్టింపు అయ్యాయన్నారు. లిక్కర్ మాఫియా, సాండ్ మాఫియా, బెట్టింగ్ మాఫియా ఏ మాఫియా కావాలన్నా నెల్లూరులో […]

Advertisement
Update:2019-12-06 12:37 IST

సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు నగరాన్ని మాఫియా చేతుల్లో పెట్టారంటూ సంచలన కామెంట్స్ చేశారు.

ఈ మాఫియాలకు అడ్డుకట్ట వేసేంత ధైర్యం పోలీసులకు ఉన్నా… వారి ఉద్యోగ భద్రత గురించి ఆలోచించి అడుగు ముందుకేయలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.

ఐదేళ్లలో నలుగురు ఎస్పీలను మార్చడం బట్టి ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు.

నెల్లూరులో ఐదేళ్లలో మాఫియా ఆగడాలు రెట్టింపు అయ్యాయన్నారు. లిక్కర్ మాఫియా, సాండ్ మాఫియా, బెట్టింగ్ మాఫియా ఏ మాఫియా కావాలన్నా నెల్లూరులో ఉందన్నారు. స్వచ్చమైన తేనె కావాలంటే వెంకటగిరి అడవులకు వెళ్లాలి… మాఫియాలు కావాలంటే నెల్లూరుకు వెళ్లాలి అన్నట్టుగా పరిస్థితి తయారైందన్నారు.

ఈ మాఫియా ఆగడాలను భరించలేక లక్షలాది మంది ప్రజలు లోలోన కుమిలిపోతున్నారని ఆనం వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని మార్చే పోలీసు అధికారులు వచ్చినా…. ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు ఉండనివ్వడం లేదన్నారు.

రెండు రోజుల క్రితమే నెల్లూరు ఎస్పీ ఐశ్వర్య రస్తోగిని బదిలీ చేసి కొత్తగా భాస్కర్ భూషణ్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Tags:    
Advertisement

Similar News