400 సిక్సర్ల రికార్డుకు రోహిత్ గురి
399 సిక్సర్లతో భారత సిక్సర్లకింగ్ గా రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో 400 సిక్సర్ల రికార్డు సాధించిన భారత తొలి క్రికెటర్ రికార్డుకు డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ గురిపెట్టాడు. క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ కలసి తన కెరియర్ లో ఇప్పటి వరకూ 399 సిక్సర్లు బాదిన రోహిత్ మరో సిక్సర్ సాధించగలిగితే… 400 సిక్సర్ల మైలురాయిని చేరిన భారత తొలి క్రికెటర్ కాగలుగుతాడు. హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా మరికొద్దిగంటల్లో జరిగే తొలి టీ-20 మ్యాచ్ లో విండీస్ పై […]
- 399 సిక్సర్లతో భారత సిక్సర్లకింగ్ గా రోహిత్
అంతర్జాతీయ క్రికెట్లో 400 సిక్సర్ల రికార్డు సాధించిన భారత తొలి క్రికెటర్ రికార్డుకు డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ గురిపెట్టాడు. క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ కలసి తన కెరియర్ లో ఇప్పటి వరకూ 399 సిక్సర్లు బాదిన రోహిత్ మరో సిక్సర్ సాధించగలిగితే… 400 సిక్సర్ల మైలురాయిని చేరిన భారత తొలి క్రికెటర్ కాగలుగుతాడు.
హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా మరికొద్దిగంటల్లో జరిగే తొలి టీ-20 మ్యాచ్ లో విండీస్ పై రోహిత్ శర్మ ఓ సిక్సర్ బాదినా 400 సిక్సర్ల రికార్డును చేరుకోగలుగుతాడు.
అగ్రస్థానంలో క్రిస్ గేల్..
క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 534 సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డు విండీస్ సుడిగాలి ఓపెనర్ క్రిస్ గేల్ పేరుతో ఉంది. టెస్ట్, వన్డే, టీ-20 ఫార్మాట్లలో కలసి గేల్ 500కు పైగా సిక్సర్లు బాదిన తొలి, ఒకే ఒక్క క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు.
ఆ తర్వాతి స్థానంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహీద్ ఆఫ్రిదీ 476 సిక్సర్లతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ 399 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
ఓ టెస్ట్ సిరీస్ లో అత్యధికంగా 19 సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డు రోహిత్ పేరుతోనే ఉంది.