మొన్న కడప.... నిన్న కర్నూలు....

క‌డ‌ప జిల్లా నుంచి సీన్ క‌ర్నూలు జిల్లాకు మారింది. కానీ సీన్ మాత్రం మార‌లేదు. అదే ఫైటింగ్ సీన్‌. చంద్ర‌బాబు ముందే తెలుగుదేశం త‌మ్ముళ్లు త‌న్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కెడి సిసి బ్యాంక్ చైర్మన్ మల్లిఖార్జున రెడ్డి గొడవపడ్డారు. తనను స్టేజి మీదకు పిలవలేదని ఆవేశంతో ఊగిపోయిన మల్లిఖార్జున రెడ్డి సోమిశెట్టిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. జిల్లా టీడీపీలో పార్టీ కోసం పని చేస్తున్న వారికి సోమిశెట్టి సరైన గుర్తింపు ఇవ్వడం లేదని కొంత […]

Advertisement
Update:2019-12-05 04:36 IST

క‌డ‌ప జిల్లా నుంచి సీన్ క‌ర్నూలు జిల్లాకు మారింది. కానీ సీన్ మాత్రం మార‌లేదు. అదే ఫైటింగ్ సీన్‌. చంద్ర‌బాబు ముందే తెలుగుదేశం త‌మ్ముళ్లు త‌న్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కెడి సిసి బ్యాంక్ చైర్మన్ మల్లిఖార్జున రెడ్డి గొడవపడ్డారు.

తనను స్టేజి మీదకు పిలవలేదని ఆవేశంతో ఊగిపోయిన మల్లిఖార్జున రెడ్డి సోమిశెట్టిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. జిల్లా టీడీపీలో పార్టీ కోసం పని చేస్తున్న వారికి సోమిశెట్టి సరైన గుర్తింపు ఇవ్వడం లేదని కొంత మంది నేతలు కోపంగా ఉన్నారు. స‌మీక్ష స‌మావేశంలో అదే ఇష్యూ రావ‌డంతో ఒక్క‌సారిగా గొడ‌వ‌కు దిగారు.

మల్లిఖార్జున రెడ్డి ఒక్క సారిగా గొడ‌వ‌కు దిగడంతో చంద్రబాబు సైతం అవాక్కయిన పరిస్థితి నెలకొంది. అయితే తన ముందే జిల్లా అధ్యక్షుడి పై అసభ్యంగా ప్రవర్తించడంతో మల్లిఖార్జున రెడ్డిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఈ గొడవకు కారణం వేరే ఉందని, ఎన్నికల అనంతరం జిల్లాలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో జిల్లా పార్టీ పగ్గాలు గౌరు వెంకటరెడ్డికి అప్పజెప్పాలని చంద్రబాబు అనుకుంటున్నార‌ని, అందుకు పార్టీలోని కొందరు ముఖ్య నేతలు, ముఖ్యంగా కేఈ ప్రభాకర్ లాంటి సీనియర్లు వ్యతిరేకించినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కేఈ ప్రభాకర్ ముఖ్య అనుచరుడైన మల్లిఖార్జున రెడ్డి ఈ రకంగా చంద్రబాబు ముందే తమ అసహనాన్ని జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టిపై చూపారని గుస గుసలు వినిపిస్తున్నాయి.

కర్నూల్ జిల్లాలో వ‌ర్గ‌పోరు ఇప్పుడు బ‌హిర్గ‌త‌మైంది. ముందుముందు ఎటు దారితీస్తుందో అనే ఆందోళ‌న మాత్రం కార్య‌క‌ర్త‌ల్లో నెల‌కొంది.

Tags:    
Advertisement

Similar News