శాఫ్ గేమ్స్ లో భారత్ బంగారువేట

ట్రాక్ అండ్ ఫీల్డ్ లో భారత్ క్లీన్ స్వీప్ నేపాల్ వేదికగా జరుగుతున్న 13వ దక్షిణాసియా దేశాల క్రీడల మూడోరోజున భారత్ పుంజుకొంది. ఇప్పటి వరకూ పతకాలపట్టిక అగ్రస్థానంలో నిలిచిన నేపాల్ ను రెండోస్థానానికి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. మూడోరోజు పోటీలలో భాగంగా ఖట్మండా దశరథ్ స్టేడియం వేదికగా జరిగిన ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగాలలో భారత అథ్లెట్లు 20 కి 20 పతకాలు సాధించడం ద్వారా తమ ఆధిపత్యాన్ని చాటుకొన్నారు. మూడోరోజు పోటీలు ముగిసే సమయానికి భారత్32 […]

Advertisement
Update:2019-12-05 04:33 IST
  • ట్రాక్ అండ్ ఫీల్డ్ లో భారత్ క్లీన్ స్వీప్

నేపాల్ వేదికగా జరుగుతున్న 13వ దక్షిణాసియా దేశాల క్రీడల మూడోరోజున భారత్ పుంజుకొంది. ఇప్పటి వరకూ పతకాలపట్టిక అగ్రస్థానంలో నిలిచిన నేపాల్ ను రెండోస్థానానికి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది.

మూడోరోజు పోటీలలో భాగంగా ఖట్మండా దశరథ్ స్టేడియం వేదికగా జరిగిన ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగాలలో భారత అథ్లెట్లు 20 కి 20 పతకాలు సాధించడం ద్వారా తమ ఆధిపత్యాన్ని చాటుకొన్నారు.

మూడోరోజు పోటీలు ముగిసే సమయానికి భారత్32 స్వర్ణాలతో సహా మొత్తం 71 పతకాలతో పతకాల పట్టిగ అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో 26 రజత, 13 కాంస్య పతకాలు సైతం ఉన్నాయి.

కేవలం మూడోరోజు పోటీల ద్వారానే 15 బంగారు పతకాలు సాధించడం విశేషం. అథ్లెటిక్స్ ద్వారా 5 స్వర్ణాలు సాధించడంతో నేపాల్ ను భారత్ అధిగమించగలిగింది.

ఆతిథ్య నేపాల్ 29 స్వర్ణ, 15 రజత, 25 కాంస్యాలతో సహా మొత్తం 69 పతకాలు సాధించడం ద్వారా భారత్ తర్వాతి స్తానంలో నిలిచింది.

టీటీలో గోల్డెన్ షో..

భారత అథ్లెట్లు టేబుల్ టెన్నిస్ లో మూడేసి స్వర్ణ, రజత పతకాలు, టైక్వాండూలో 3 స్వర్ణ, ఖో-ఖోలో రెండు స్వర్ణ, ట్రయాథ్లాన్ లో 2 బంగారు పతకాలు గెలుచుకొన్నారు.

Tags:    
Advertisement

Similar News