పవన్‌ కళ్యాణ్‌ కు ఏమైంది?

పవన్‌ కళ్యాణ్‌ మాటలు వింటుంటే…. ఆయన మానసికస్థితి మీద చాలామందికి అనుమానం కలుగుతోంది. ఎదుటి పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిని సందర్భం ఉన్నప్పుడు విమర్శించాల్సిందే… తప్పు చేస్తే నిలదీయాల్సిందే… కానీ జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మాత్రం మతి తప్పి మాట్లాడుతున్నాడు. రాయలసీమ…. రైల్వేకోడూరులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ… నేను తిరుపతి ఎయిర్‌పోర్టులో దిగి రైల్వేకోడూరుకు వస్తుంటే ఒక తల్లి తనను కలిసి ఆడబిడ్డల రక్షణ కోసం పోరాడమని కోరిందని…. 2017లో రెసిడెన్షియల్‌ స్కూల్‌ లో తన […]

Advertisement
Update:2019-12-02 05:55 IST

పవన్‌ కళ్యాణ్‌ మాటలు వింటుంటే…. ఆయన మానసికస్థితి మీద చాలామందికి అనుమానం కలుగుతోంది. ఎదుటి పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిని సందర్భం ఉన్నప్పుడు విమర్శించాల్సిందే… తప్పు చేస్తే నిలదీయాల్సిందే… కానీ జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మాత్రం మతి తప్పి మాట్లాడుతున్నాడు.

రాయలసీమ…. రైల్వేకోడూరులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ… నేను తిరుపతి ఎయిర్‌పోర్టులో దిగి రైల్వేకోడూరుకు వస్తుంటే ఒక తల్లి తనను కలిసి ఆడబిడ్డల రక్షణ కోసం పోరాడమని కోరిందని…. 2017లో రెసిడెన్షియల్‌ స్కూల్‌ లో తన కూతురిని రేప్‌ చేసి హత్య చేశారని, ఆమె చెబితే తనకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయని పవన్‌ కళ్యాణ్‌ అన్నాడు.

ఈ కేసును ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఎందుకు తొక్కి పెడుతున్నారు? రేప్‌ చేసిన వాళ్ళను ఎందుకు కాపాడుతున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకులకు, పోలీసులకు ఆడపిల్లలు లేరా? వీళ్లను నిలదీసే వాళ్ళు లేరా? అని ప్రశ్నించాడు.

పవన్‌ కళ్యాణ్‌ మాటలు వింటుంటే జనాలకు మతి పోతోంది. ఈ నేరం జరిగింది ఎప్పుడు? 2017లో. అప్పటి నుంచి 2019 మే వరకు అధికారంలో ఉన్నదెవరు? చంద్రబాబు నాయుడు. పవన్‌ ప్రశ్నించాల్సింది చంద్రబాబు నాయుడిని. కానీ ఆయన ప్రశ్నిస్తున్నది ఇప్పుడు ఆరు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్‌ను.

ఆయన చంద్రబాబును ఒక్క మాట అనడు. ఆయన చేసిన తప్పులను కూడా ఇతరులమీద వేసి ఇతరులను ప్రశ్నిస్తాడు. బహుశా రాజకీయాల్లో ఇంతటి బానిస మనస్తత్వాన్ని గతంలో చూడలేదు… భవిష్యత్తులో మరో నాయకుడిలో ఇక చూడలేమేమో…!

Tags:    
Advertisement

Similar News