మరిదిపై చెప్పుల దాడి పట్ల పురందేశ్వరి ఆగ్రహం

రాజధాని పర్యటనకు వచ్చిన చంద్రబాబునాయుడుపై…. రైతులు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్పులు వేయడంపై బీజేపీ నాయకురాలు పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై చెప్పుల దాడిని ఆమె ఖండించారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుందని… కాని నిరసన పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై చెప్పులు వేయడం సరికాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో సరైన రాజధాని నిర్మించలేకపోయారని.. ఆ బాధ అయితే ప్రజల్లో ఉందన్నారు. కానీ ఆ బాధను ఇలా చెప్పులు విసరడం ద్వారా […]

Advertisement
Update:2019-11-30 03:14 IST

రాజధాని పర్యటనకు వచ్చిన చంద్రబాబునాయుడుపై…. రైతులు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్పులు వేయడంపై బీజేపీ నాయకురాలు పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై చెప్పుల దాడిని ఆమె ఖండించారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుందని… కాని నిరసన పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై చెప్పులు వేయడం సరికాదని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఐదేళ్ల కాలంలో సరైన రాజధాని నిర్మించలేకపోయారని.. ఆ బాధ అయితే ప్రజల్లో ఉందన్నారు. కానీ ఆ బాధను ఇలా చెప్పులు విసరడం ద్వారా వ్యక్తపరచడం మంచిది కాదన్నారు. రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పు రావడంలేదన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే వాతావరణం కనిపించడం లేదని… జాతీయ మీడియాలోనూ ఇదే అంశంపై చర్చ జరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.

చంద్రబాబుపై చెప్పుల దాడిని పురందేశ్వరి తీవ్రంగా తప్పుపట్టిన నేపథ్యంలో కొందరు నెటిజన్లు ఆమెకు వైస్రాయ్‌ హోటల్ ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు. సొంత తండ్రి ఎన్‌టీఆర్‌పై వైస్రాయ్ హోటల్ వేదికగా చంద్రబాబు చెప్పులతో కొట్టించిన ఉదంతాన్ని పురందేశ్వరి మరిచినట్టుగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News