ఢిల్లీ స్టేడియంలో గంభీర్ పేరుతో స్టాండ్

భారతజట్టుకు 58 టెస్టులు, 147 వన్డేలు ఆడిన గంభీర్ భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ పేరుతో…ఢిల్లీ క్రికెట్ సంఘం ఎట్టకేలకు ఓ స్టాండ్ ను ఏర్పాటు చేయగలిగింది. ఢిల్లీలోని పిరోజ్ షా కోట్లా కమ్ అరుణ్ జైట్లీ స్టేడియం నార్త్ స్టాండ్ కు గౌతం గంభీర్ పేరును పెడుతూ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుత బీజెపీ ఎంపీగా సేవలు అందిస్తున్న గౌతం గంభీర్ కు దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి, ఐపీఎల్ లో కోల్ కతాకు ప్రాతినిథ్యం వహించిన […]

Advertisement
Update:2019-11-27 03:16 IST
  • భారతజట్టుకు 58 టెస్టులు, 147 వన్డేలు ఆడిన గంభీర్

భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ పేరుతో…ఢిల్లీ క్రికెట్ సంఘం ఎట్టకేలకు ఓ స్టాండ్ ను ఏర్పాటు చేయగలిగింది. ఢిల్లీలోని పిరోజ్ షా కోట్లా కమ్ అరుణ్ జైట్లీ స్టేడియం నార్త్ స్టాండ్ కు గౌతం గంభీర్ పేరును పెడుతూ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రస్తుత బీజెపీ ఎంపీగా సేవలు అందిస్తున్న గౌతం గంభీర్ కు దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి, ఐపీఎల్ లో కోల్ కతాకు ప్రాతినిథ్యం వహించిన రికార్డు ఉంది. అంతేకాదు.. భారత్ తరపున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ-20 మ్యాచులు ఆడిన అనుభవం సైతం ఉంది.

ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఇప్పటికే బిషిన్ సింగ్ బేడీ, మొహిందర్ అమర్ నాథ్ , వీరేంద్ర సెహ్వాగ్, అంజుమ్ చోప్రాల పేర్లతో స్టాండ్ లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఢిల్లీజట్టుకు చిరకాలం సేవలు అందించిన తనపేరుతో ఓ స్టాండ్ ను ఏర్పాటు చేయటానికి ఎందుకు తాత్సారం చేస్తూ వచ్చారో ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రజత్ శర్మ మాత్రమే సమాధానం చెప్పాలంటూ 38 ఏళ్ల గౌతం గంభీర్ నిలదీశాడు.

Tags:    
Advertisement

Similar News