రేపు మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ప్రమాణం... డిప్యూటీ సీఎంలు వీరే...

మహారాష్ట్రలో బీజేపీ సర్కారు కూలిపోయింది. ముచ్చటగా మూడు రోజులే ఉండి బలపరీక్షకు ముందే ఫడ్నవీస్ చేతులేత్తేశాడు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ రాజీనామాతో తమకు అసెంబ్లీలో తగినంత సంఖ్యా బలం లేని కారణంగా వైదొలుగుతున్నట్టు ఫడ్నీవీస్ ప్రకటించారు. ఇక తాము మహారాష్ట్రలో ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల గొంతుక వినిపిస్తామని ఫడ్నవీస్ చెప్పుకొచ్చాడు. ఇక మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ రాజీనామాతో రేపటి బలపరీక్ష కూడా ముగిసిపోయింది. ఇప్పటికే 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి గవర్నర్ […]

Advertisement
Update:2019-11-26 12:10 IST

మహారాష్ట్రలో బీజేపీ సర్కారు కూలిపోయింది. ముచ్చటగా మూడు రోజులే ఉండి బలపరీక్షకు ముందే ఫడ్నవీస్ చేతులేత్తేశాడు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ రాజీనామాతో తమకు అసెంబ్లీలో తగినంత సంఖ్యా బలం లేని కారణంగా వైదొలుగుతున్నట్టు ఫడ్నీవీస్ ప్రకటించారు. ఇక తాము మహారాష్ట్రలో ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల గొంతుక వినిపిస్తామని ఫడ్నవీస్ చెప్పుకొచ్చాడు.

ఇక మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ రాజీనామాతో రేపటి బలపరీక్ష కూడా ముగిసిపోయింది. ఇప్పటికే 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి గవర్నర్ ముందర పెరేడ్ నిర్వహించింది. దీంతో రేపు ఈ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలువనున్నారు.

కాగా రేపు మహారాష్ట్ర సీఎంగా మూడు పార్టీలు ఏకగ్రీవంగా శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే పేరును ఖరారు చేశాయి. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రాజీనామాతో అత్యవసరంగా సమావేశమైన మూడు పార్టీల నేతలు ఈ మేరకు తమ సీఎం అభ్యర్థిగా ఉద్దవ్ ఠాక్రే పేరును ఖరారు చేశాయి. ఇక డిప్యూటీ సీఎంలుగా ఎన్సీపీ ఎమ్మెల్యే జయంత్ పాటిల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలాసాహెబ్ థోరట్ లను ఎన్నుకున్నారు. ఈ మేరకు రేపు మూడు పార్టీల సంకీర్ణ సర్కారు మహారాష్ట్రలో అధికారం చేపట్టనుంది.

Tags:    
Advertisement

Similar News