వర్మ ‘కమ్మరాజ్యంలో’ సినిమాపై.... హైకోర్టులో మరో పిటీషన్
రాంగోపాల్ వర్మ ఏపీ రాజకీయ పరిస్థితులపై సంధిస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ మూవీ విడుదల అవుతుందా లేదా అన్న సందిగ్ధంలో పడిపోయింది. ఈ నెలాఖరున ఈ మూవీని విడుదల చేసేందుకు తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీలో మొన్నటి ఎన్నికల వేళ, అనంతర పరిణామాలపై వర్మ ఈ వివాదాస్పద చిత్రాన్ని తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో తనను అవమానించేలా చిత్రీకరించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ హైకోర్టుకెక్కారు. సినిమా విడుదల ఆపాలని కోరారు. తాజాగా కమ్మరాజ్యంలో కడపరెడ్లు […]
రాంగోపాల్ వర్మ ఏపీ రాజకీయ పరిస్థితులపై సంధిస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ మూవీ విడుదల అవుతుందా లేదా అన్న సందిగ్ధంలో పడిపోయింది. ఈ నెలాఖరున ఈ మూవీని విడుదల చేసేందుకు తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఏపీలో మొన్నటి ఎన్నికల వేళ, అనంతర పరిణామాలపై వర్మ ఈ వివాదాస్పద చిత్రాన్ని తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో తనను అవమానించేలా చిత్రీకరించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ హైకోర్టుకెక్కారు. సినిమా విడుదల ఆపాలని కోరారు.
తాజాగా కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపై తెలంగాణ హైకోర్టులోనూ పిటీషన్ దాఖలైంది. ఈ సినిమా కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందటూ…. సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఇంద్రసేన చౌదరి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. సినిమా విడుదల అయితే కమ్మ, రెడ్డి కులస్థల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉందని.. వెంటనే విచారణ జరపాలని కోర్టులో పిటీషన్ వేశారు.
ఇక ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. దీనిపై రేపు విచారణ చేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈనెల 29న రిలీజ్ కు రెడీ అయిన ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా విడుదల అవుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.