హాకీ ఫీల్డ్ లో పంజాబ్ జట్ల వీరంగం

మ్యాచ్ మధ్యలోనే బజారు రౌడీల్లా కలబడ్డ ప్లేయర్లు పంజాబ్ జట్లపైన హాకీ ఇండియా సిరియస్ జాతీయక్రీడ హాకీకే పంజాబ్ పోలీస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జట్ల ఆటగాళ్లు తలవంపులు తెచ్చారు. భారత హాకీ పితామహుడు మేజర్ ధ్యాన్ చంద్ ఆత్మకు శాంతి లేకుండా చేశారు. ఢిల్లీ వేదికగా జరిగిన 2019 నెహ్రూ గోల్డ్ కప్ హాకీ ఫైనల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ పోలీసు జట్లు తలపడ్డాయి. ఆట మధ్యలో ఆవేశకావేశాలకు లోనైన రెండుజట్ల ఆటగాళ్లు… హాకీని పక్కన పెట్టి […]

Advertisement
Update:2019-11-26 03:49 IST
  • మ్యాచ్ మధ్యలోనే బజారు రౌడీల్లా కలబడ్డ ప్లేయర్లు
  • పంజాబ్ జట్లపైన హాకీ ఇండియా సిరియస్

జాతీయక్రీడ హాకీకే పంజాబ్ పోలీస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జట్ల ఆటగాళ్లు తలవంపులు తెచ్చారు. భారత హాకీ పితామహుడు మేజర్ ధ్యాన్ చంద్ ఆత్మకు శాంతి లేకుండా చేశారు.

ఢిల్లీ వేదికగా జరిగిన 2019 నెహ్రూ గోల్డ్ కప్ హాకీ ఫైనల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ పోలీసు జట్లు తలపడ్డాయి. ఆట మధ్యలో ఆవేశకావేశాలకు లోనైన రెండుజట్ల ఆటగాళ్లు… హాకీని పక్కన పెట్టి బజారు రౌడీల్లా కలబడి కొట్లాటకు దిగారు. హాకీ స్టిక్ లతోనే యుద్ధానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులు హాకీకి బదులుగా హాకీ స్టిక్ ల సమరం చూడాల్సి వచ్చింది.

ఈ సంఘటన క్రీడాస్ఫూర్తికే విరుద్దమని, జాతీయక్రీడ హాకీకే తలవంపులు తెచ్చిందని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరేంద్ర బాత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఘర్షణకు దిగిన రెండుజట్ల సభ్యులపైన తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ భారత హాకీ సంఘాన్ని ఆదేశించారు.
భారత హాకీ చరిత్రలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి.

Tags:    
Advertisement

Similar News