పరిపూర్ణానంద ఎక్కడ? ఆయనకు బాబు స్ట్రోక్ తగిలిందా?

పరిపూర్ణానంద. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడి చేశారు. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారు. బీజేపీ శ్రేణులను ఉత్తేజ పరిచారు. అమిత్‌షాతో ఫోటోలు దిగి హల్‌చల్‌ చేశారు. ఒక దశలో ఆయనను తెలంగాణ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్‌ చేశారు. కానీ తీరా ఎన్నికల్లో చూస్తే బీజేపీ ఒకే ఒక సీటు గెలిచింది. దీంతో పరిపూర్ణానంద హవా తగ్గింది. పార్లమెంట్‌ ఎన్నికల వేళ కూడా పరిపూర్ణానంద కరీంనగర్‌ నుంచి పోటీ చేస్తారని…మహబూబ్‌నగర్‌ నుంచి బరిలో ఉంటారని […]

Advertisement
Update:2019-11-25 02:27 IST

పరిపూర్ణానంద. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడి చేశారు. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారు. బీజేపీ శ్రేణులను ఉత్తేజ పరిచారు. అమిత్‌షాతో ఫోటోలు దిగి హల్‌చల్‌ చేశారు. ఒక దశలో ఆయనను తెలంగాణ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్‌ చేశారు. కానీ తీరా ఎన్నికల్లో చూస్తే బీజేపీ ఒకే ఒక సీటు గెలిచింది. దీంతో పరిపూర్ణానంద హవా తగ్గింది.

పార్లమెంట్‌ ఎన్నికల వేళ కూడా పరిపూర్ణానంద కరీంనగర్‌ నుంచి పోటీ చేస్తారని…మహబూబ్‌నగర్‌ నుంచి బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు సీటు ఇవ్వలేదు. కనీసం ప్రచారానికి కూడా పిలవలేదు.

ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ చంద్రబాబుతో పరిపూర్ణానంద కుమ్మక్కు అయ్యారని తెలుస్తోంది. ఆయన డైరెక్షన్‌లో పరిపూర్ణానంద పనిచేశారని బీజేపీలో ప్రచారం జరుగుతోంది.

చంద్రబాబుతో కుమ్మక్కు అయ్యారని తెలిసిన తర్వాత బీజేపీ నేతలు ఆయన్ని పక్కన పెట్టారని అంటున్నారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ కోసం పరిపూర్ణానంద చాలా సార్లు ప్రయత్నించారట. కానీ అమిత్‌ షా మాత్రం ఒక్కసారి కూడా స్పందించలేదట. అసలు ఢిల్లీకి రావొద్దని…ఆయనకు బీజేపీతో సంబంధాలు లేవని క్లియర్‌ కట్‌ మెసేజ్‌ పంపించారట. దీంతో అప్పటి నుంచి పరిపూర్ణానంద పూర్తిగా డల్‌ అయ్యారట.

ఇటు పరిపూర్ణానంద ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక చానల్‌ కూడా మూసివేత దిశగా నడుస్తోంది. ఇప్పటికే అక్కడ పనిచేసే ఉద్యోగులు తమ దారి తామది అన్నట్లుగానే ముందుకెళ్తున్నారట. ఇతర బీజేపీ సానుభూతిపరులు కూడా యూ ట్యూబ్‌ చానల్స్ నడిపిస్తున్నారు.

అయితే పరిపూర్ణానంద… చంద్రబాబుతో కలవడం వల్లే విశ్వసనీయత కోల్పోయానని ఆయన సన్నిహితుల వద్ద చెప్పుకొని ఇప్పుడు వాపోతున్నట్లు సమాచారం. ఆయన రాజకీయ ఎదుగుదలకు కూడా బ్రేక్‌లు పడ్డాయని…. అందుకే పరిపూర్ణానంద బయటకు రావడమే మానేశారని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News