పవన్ ట్విట్టర్... టీడీపీ హ్యాండిల్ చేస్తోందా?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఆయన అయ్యింది క్రియాశీల రాజకీయాల్లో కాదు.. ట్విట్టర్ లో.. చాలా చురుకుగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.. పదునైన రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ప్రతీ రోజు వరుస ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త క్యాంపెయిన్ ను సృష్టించారు. ‘మన నుడి-మన నది’ అంటూ ట్విట్టర్లో ప్రచారం చేస్తున్నారు. ఈయన ప్రచారాన్ని చూస్తుంటే ఇది టీడీపీ సోషల్ మీడియా విభాగం నిర్వహిస్తుందనే అభిప్రాయాన్ని కలుగచేస్తోంది. ప్రముఖ సెలెబ్రెటీలందరూ […]

Advertisement
Update:2019-11-25 07:59 IST

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఆయన అయ్యింది క్రియాశీల రాజకీయాల్లో కాదు.. ట్విట్టర్ లో.. చాలా చురుకుగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.. పదునైన రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ప్రతీ రోజు వరుస ట్వీట్లు చేస్తున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త క్యాంపెయిన్ ను సృష్టించారు. ‘మన నుడి-మన నది’ అంటూ ట్విట్టర్లో ప్రచారం చేస్తున్నారు. ఈయన ప్రచారాన్ని చూస్తుంటే ఇది టీడీపీ సోషల్ మీడియా విభాగం నిర్వహిస్తుందనే అభిప్రాయాన్ని కలుగచేస్తోంది.

ప్రముఖ సెలెబ్రెటీలందరూ తమ సోషల్ మీడియా ఎకౌంట్లను నిర్వహించడానికి కొన్ని మీడియా సంస్థలకు ఇవ్వడం పరిపాటి. ఇప్పుడు పవన్ కూడా తన ట్విట్టర్ ఎకౌంట్ ను టీడీపీకి ఇచ్చినట్టుగా పరిస్థితి చూస్తే కనిపిస్తోందని… వైసీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు మాటలను సామన్య ప్రజలు ఎవరూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. వైసీపీ ప్రభుత్వం పై ఆయన ఎన్ని విమర్శలు చేసినా పెద్దగా వర్కవుట్ కావడం లేదు. సినిమాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన పవన్ కళ్యాణ్ ద్వారానే ప్రభుత్వాన్ని విమర్శించేందుకు… టీడీపీయే ఈ పని చేస్తుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

తాజాగా పవన్ కళ్యాణ్ ట్వీట్లు టీడీపీ విభాగం నేరుగా అందించిన ‘కంటెంట్’ ఆధారంగా లేదా వారి బృందం అతని ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తున్నట్టుగా కనిపిస్తోంది. పవన్ చేస్తున్న చాలా ట్వీట్లు తెలుగుదేశం పార్టీ తీసుకున్న వైఖరిని అనుసరిస్తుండడం గమనార్హం. దీంతో టీడీపీయే ఈ ట్వీట్స్ ను పవన్ ద్వారా చేయిస్తుందా… లేక ఆయన ఎకౌంట్ ను హ్యాండీల్ చేస్తుందా? అన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.

Tags:    
Advertisement

Similar News