ఒలింపిక్ హాకీలో భారత్ కు క్లిష్టమైన డ్రా

ఒకే గ్రూపులో భారత్, అర్జెంటీనా, ఆస్ట్ర్రేలియా టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ హాకీ పురుషుల, మహిళల విభాగంలో భారతజట్లకు క్లిష్టమైన డ్రా ఎదురయ్యింది. ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్ర్రేలియా, ఒలింపిక్స్ విజేత అర్జెంటీనా లాంటి మేటి జట్లతో గ్రూప్ – ఏ లీగ్ లో తలపడాల్సి ఉంది. గ్రూపు-ఏ లీగ్ లోని ఇతర జట్లలో స్పెయిన్, న్యూజిలాండ్, జపాన్ జట్లు సైతం ఉన్నాయి. ప్రపంచ 5వ ర్యాంకర్ భారత్ కు అర్జెంటీనా, ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్ లాంటి జట్ల […]

Advertisement
Update:2019-11-24 04:23 IST
  • ఒకే గ్రూపులో భారత్, అర్జెంటీనా, ఆస్ట్ర్రేలియా

టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ హాకీ పురుషుల, మహిళల విభాగంలో భారతజట్లకు క్లిష్టమైన డ్రా ఎదురయ్యింది. ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్ర్రేలియా, ఒలింపిక్స్ విజేత అర్జెంటీనా లాంటి మేటి జట్లతో గ్రూప్ – ఏ లీగ్ లో తలపడాల్సి ఉంది.

గ్రూపు-ఏ లీగ్ లోని ఇతర జట్లలో స్పెయిన్, న్యూజిలాండ్, జపాన్ జట్లు సైతం ఉన్నాయి. ప్రపంచ 5వ ర్యాంకర్ భారత్ కు అర్జెంటీనా, ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్ లాంటి జట్ల నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.

పురుషుల గ్రూపు-బీ లీగ్ లో బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీ, గ్రేట్ బ్రిటన్, కెనడా, సౌతాఫ్రికాజట్లు పోటీపడతాయి.

మహిళల విభాగంలో సైతం 9వ ర్యాంకర్ భారత్ గ్రూప్-ఏ లీగ్ లో పోటీపడాల్సి ఉంది. 9వ ర్యాంకర్ భారత్ కు ప్రపంచ నంబర్ వన్ నెదర్లాండ్స్, ఒలింపిక్స్ విజేత గ్రేట్ బ్రిటన్, జర్మనీ, ఐర్లాండ్,సౌతాఫ్రికా జట్లతో అమీతుమీ తేల్చుకోనుంది.

మహిళల గ్రూపు- ఏ లీగ్ లోని జట్లలో ఆస్ట్ర్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, స్పెయిన్, చైనా, జపాన్ జట్లు తలపడనున్నాయి.

మొత్తం మీద ఎనిమిదిసార్లు ఒలింపిక్స్ విజేత భారత్ ఏదో ఒక పతకం సాధించాలంటే.. గ్రూప్ లీగ్ నుంచి ముందుగా సెమీస్ నాకౌట్ రౌండ్ కు చేరాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News