పింక్ బాల్ టెస్ట్ లో ఇషాంత్ రికార్డు
100 క్యాచ్ ల వృద్ధిమాన్ సాహా భారత గడ్డపై జరిగిన మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ లో 5 వికెట్లు సాధించిన భారత తొలి బౌలర్ ఘనతను ఓపెనింగ్ బౌలర్ ఇశాంత్ శర్మ సొంతం చేసుకొన్నాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ తొలిరోజు ఆటలోనే ఇశాంత్ చెలరేగిపోయాడు. ఇశాంత్ కేవలం 12 ఓవర్లలోనే 22 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం ద్వారా బంగ్లాదేశ్ ను 30.3 ఓవర్లలో […]
- 100 క్యాచ్ ల వృద్ధిమాన్ సాహా
భారత గడ్డపై జరిగిన మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ లో 5 వికెట్లు సాధించిన భారత తొలి బౌలర్ ఘనతను ఓపెనింగ్ బౌలర్ ఇశాంత్ శర్మ సొంతం చేసుకొన్నాడు.
కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ తొలిరోజు ఆటలోనే ఇశాంత్ చెలరేగిపోయాడు.
ఇశాంత్ కేవలం 12 ఓవర్లలోనే 22 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం ద్వారా బంగ్లాదేశ్ ను 30.3 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూల్చడంలో ప్రధానపాత్ర వహించాడు.
ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు, మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టడం ద్వారా బంగ్లాదేశ్ పై సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శించగలిగారు.
100 అవుట్ల సాహా…
ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో షడ్మాన్ ఇస్లాం ఇచ్చిన క్యాచ్ తో సాహా ఈ రికార్డును చేరుకోగలిగాడు.
గతంలో ఇదే ఘనత సాధించిన భారత వికెట్ కీపర్లలో మహేంద్రసింగ్ ధోనీ, కిరణ్ మోరే, సయ్యద్ కిర్మాణీ, నయన్ మోంగియా ఉన్నారు. మహేంద్ర సింగ్ ధోనీ తన టెస్ట్ కెరియర్ లో మొత్తం 294 మందిని అవుట్ చేయడం ద్వారా అగ్రస్థానంలో ఉన్నాడు.