ఆంధ్రజ్యోతి, ఈనాడుపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు

ఇటీవల పార్లమెంట్‌ సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష భేటీలో ఇతర పార్టీల ఎంపీలు తనకు క్లాస్‌ పీకారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలపై లోక్‌సభ స్పీకర్‌తో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు దురుద్దేశంతో తనపై తప్పుడు కథనాలు ప్రచురించాయని… కాబట్టి సదరు సంస్థలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. ఎంపీగా ఉన్న తన ప్రతిష్టను అపఖ్యాతి పాలు చేసేందుకు ప్రయత్నించడంతో […]

Advertisement
Update:2019-11-22 03:34 IST

ఇటీవల పార్లమెంట్‌ సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష భేటీలో ఇతర పార్టీల ఎంపీలు తనకు క్లాస్‌ పీకారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలపై లోక్‌సభ స్పీకర్‌తో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు.

ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు దురుద్దేశంతో తనపై తప్పుడు కథనాలు ప్రచురించాయని… కాబట్టి సదరు సంస్థలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు.

ఎంపీగా ఉన్న తన ప్రతిష్టను అపఖ్యాతి పాలు చేసేందుకు ప్రయత్నించడంతో పాటు , పార్లమెంట్ ప్రతిష్టను దెబ్బతీస్తూ కథనాలు రాసిన సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

”విజయసాయిరెడ్డి అభాసుపాలు” అంటూ ఈనాడు, ”ఏమిటిది సాయి?” అంటూ హోంమంత్రి అమిత్ షా, ఇతర ఎంపీలు క్లాస్ పీకారంటూ ఆంధ్రజ్యోతి పత్రిక రాసిందని వివరించారు.

సమావేశంలో జరగని అంశాలను రాసి తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని విజయసాయిరెడ్డి స్పీకర్‌ దృష్టికి తెచ్చారు.

కనీసం కథనాన్ని ప్రచురించే ముందు తన వివరణ కూడా తీసుకోకుండా జర్నలిజం విలువలను పూర్తిగా వదిలేశారని విజయసాయిరెడ్డి తన లేఖలో వివరించారు.

పార్లమెంట్‌ సభ్యుల పరువు, ప్రతిష్టలను కాపాడేందుకు ఇలాంటి మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు.

Tags:    
Advertisement

Similar News