పోలవరం పనులకు మెగా శ్రీకారం
పోలవరంలో నవశకం మొదలైంది. ప్రాజెక్టులోని కీలకమైన కాంక్రీట్ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ గురువారం ప్రారంభించింది. మొదటిరోజు 100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను వేశారు. ఈ పనుల శాతాన్ని రోజు రోజుకు పెంచుకుంటూపోతూ లక్ష్యం మేరకు పనులను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నది మేఘా ఇంజనీరింగ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండర్ లో పాల్గొన్న మేఘా… పోలవరం ప్రాజెక్ట్ పనులను 12.6 శాతం తక్కువకు కోట్ చేసి దక్కించుకొని… ఈ నెల ఒకటో తేదీన […]
పోలవరంలో నవశకం మొదలైంది. ప్రాజెక్టులోని కీలకమైన కాంక్రీట్ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ గురువారం ప్రారంభించింది. మొదటిరోజు 100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను వేశారు. ఈ పనుల శాతాన్ని రోజు రోజుకు పెంచుకుంటూపోతూ లక్ష్యం మేరకు పనులను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నది మేఘా ఇంజనీరింగ్.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండర్ లో పాల్గొన్న మేఘా… పోలవరం ప్రాజెక్ట్ పనులను 12.6 శాతం తక్కువకు కోట్ చేసి దక్కించుకొని… ఈ నెల ఒకటో తేదీన ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు మేఘా సంస్థ భూమి పూజ చేసిన విషయం తెలిసిందే.
ఈ రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి 782 కోట్ల రూపాయలు ఆదా అయింది. పోలవరం పై తొలుత స్టే విధించిన ఉన్నత న్యాయస్థానం ఆ తరువాత స్టే ఎత్తివేసింది. దీంతో ఈ నెల ఒకటో తేదీన ప్రభుత్వం తో ఒప్పందం చేసుకుంది. ఆ వెంటనే భూమిపూజ చేసింది.
భూమిపూజ అనంతరం మేఘా ఇంజనీరింగ్ సంస్థ మొదటగా భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలోని రోడ్లను మరమ్మతులు చేసి…. ఆ ప్రాంతాన్ని నిర్మాణానికి అనుకూలంగా తీర్చిదిద్దింది.
తాజాగా కాంక్రీట్ పనులకు శ్రీకారం చుట్టింది. స్పిల్ వే ప్రాంతంలో పనులను గురువారం ప్రారంభించింది. ముందుగా నిర్ణయించిన సమయానికి కాంక్రీట్ వేయటం ప్రారంభించిన మేఘా సంస్థ ప్రతినిధులు తొలి రోజు 100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు. ఈ పరిమాణాన్ని రోజు రోజుకు పెంచుకుంటూ పోతామని ఎంఇఐఎల్ సంస్థ జనరల్ మేనేజర్ అంగర సతీష్ బాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలవరం ఎస్ఈ ఎం. నాగిరెడ్డి, ఈ ఈ లు పి. ఏసుబాబు, కె . శ్రీనివాసరావు, కె మల్లికార్జున రావు, పి . పాండు రంగయ్య, క్వాలిటీ కంట్రోల్ ఈఈలు పి . రవికుమార్, డీఈఈలు సిహెచ్ శివశంకర్, కె. శ్రీనివాసరావు, ఆర్. లక్ష్మణ రావు, ఎన్ . రామేశ్వరనాయుడు, కె బాలకృష్ణమూర్తి, కె శ్రీనివాస్, ఎంఇఐఎల్ జీఏం సతీష్ బాబు అంగర, మేనేజర్ పమ్మి మురళి పాల్గొన్నారు.
ప్రస్తుతం స్పిల్ వే వద్ద పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో వర్షపు నీరు ఎక్కువగా ఉంది. ఆ నీటిని తొలుత సాధారణ ప్రవాహం ద్వారా తగ్గించే ఏర్పాట్లను మేఘా సంస్థ చేసింది.
స్పిల్ వేలో మూడు లక్షల క్యూబిక్ మీటర్ల పనులు ఇంకా చేయాల్సి ఉంది. స్పిల్ ఛానల్ లో 5.3 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయాలి. స్పిల్ చానల్ లో నీటి నిల్వ ఎక్కువగా ఉంది. ఈ నీరు తగ్గిన తరువాత అక్కడ పనులు చేపట్టనుంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ.
ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, కాపర్ డ్యామ్ పనులను ఒకదాని వెనుక ఒకటి ప్రారంభిస్తామని సతీష్ బాబు చెప్పారు.
రాక్ ఫిల్ డ్యామ్ లో 1.50 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులను చేయాల్సి ఉంది. ఈ పనులను వచ్చే సీజన్ లో అంటే 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామని సతీష్ చెప్పారు. స్పిల్ వే పనులు 2020 జూన్ నాటికి పూర్తి చేస్తామని వివరించారు.