సీబీఐ, ఈడీకి గడ్కరీ లేఖ
కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సీబీఐ, ఈడీలకు కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కొందరు స్థానిక నాయకులు రోడ్ల నిర్మాణానికి అడ్డుపడుతున్నారని… అలాంటి వారిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. కమీషన్ల కోసం కొందరు దేశంలో రైల్వే లైన్లు, రోడ్ల నిర్మాణంలో అడ్డంకులు సృష్టిస్తున్నారు. గతంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం కూడా ఇదే తరహాలో కమీషన్లు ఇవ్వలేదని రైల్వే లైన్ నిర్మాణం […]
కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సీబీఐ, ఈడీలకు కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కొందరు స్థానిక నాయకులు రోడ్ల నిర్మాణానికి అడ్డుపడుతున్నారని… అలాంటి వారిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు.
కమీషన్ల కోసం కొందరు దేశంలో రైల్వే లైన్లు, రోడ్ల నిర్మాణంలో అడ్డంకులు సృష్టిస్తున్నారు. గతంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం కూడా ఇదే తరహాలో కమీషన్లు ఇవ్వలేదని రైల్వే లైన్ నిర్మాణం విషయంలో అడ్డంకులు సృష్టించారు. అప్పట్లో కేంద్ర రైల్వే శాఖ దీనిపై ఏపీ ప్రభుత్వానికి లేఖ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది.
ఇలా దేశంలో పలు రహదారుల నిర్మాణం విషయంలోనూ పలువురు స్థానిక నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారు. గడ్కరీ సొంత రాష్ట్రం మహారాష్ట్రలోనే ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లోనూ ఇదే తరహా ఫిర్యాదులున్నాయి.
ఈ నేపథ్యంలో గడ్కరీ సీబీఐ, ఈడీలకు లేఖ రాశారు. రోడ్ల నిర్మాణాలను అడ్డుకునేందుకు కొందరు నేతలు చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి ఆడియో, వీడియో టేపులను కూడా లేఖతో గడ్కరీ జత చేశారు.
తమ ప్రాంతాల్లో నిర్మాణ పనులు కొనసాగాలంటే కాంట్రాక్టర్లు మామూళ్లు ఇవ్వాల్సిందేనని కొందరు నేతలు డిమాండ్ చేసినట్టు సదరు లేఖలో కేంద్రమంత్రి వివరించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసే దిశగా కేంద్రం పనిచేస్తున్నప్పటికీ… స్థానిక నేతల నుంచి ఎదురవుతున్న అవరోధాల వల్ల ఆ పనులు ఆలస్యమవుతున్నాయని… కాబట్టి అలాంటి వారిపై దృష్టి సారించాలని సీబీఐ, ఈడీని కోరారు.