టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకి షాక్‌.... రమేష్ పౌరసత్వం రద్దు

పదేళ్ల వివాదానికి తెరపడింది. వేములవాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రమేష్‌ పౌరసత్వం చెల్లదని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది. పౌరసత్వాన్ని రద్దు చేసింది. అయితే హోంశాఖ ఆదేశాలపై మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తానని రమేష్‌ చెబుతున్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ నిర్ణయంపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది? అనేది కూడా ఆసక్తికరంగా మారింది. 2009 వేములవాడ నియోజకవర్గం నుంచి చెన్నమనేని రమేష్‌ గెలుపొందారు. అప్పుడే ఆయన పౌరసత్వంపై వివాదం చెలరేగింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పౌరసత్వం పొందారని కేంద్ర హోంశాఖకు […]

Advertisement
Update:2019-11-20 14:48 IST

పదేళ్ల వివాదానికి తెరపడింది. వేములవాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రమేష్‌ పౌరసత్వం చెల్లదని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది. పౌరసత్వాన్ని రద్దు చేసింది. అయితే హోంశాఖ ఆదేశాలపై మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తానని రమేష్‌ చెబుతున్నారు.

మరోవైపు కేంద్ర హోంశాఖ నిర్ణయంపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

2009 వేములవాడ నియోజకవర్గం నుంచి చెన్నమనేని రమేష్‌ గెలుపొందారు. అప్పుడే ఆయన పౌరసత్వంపై వివాదం చెలరేగింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పౌరసత్వం పొందారని కేంద్ర హోంశాఖకు ప్రత్యర్ధి ఆది శ్రీనివాస్‌ ఫిర్యాదు చేశారు.

2010లో హైకోర్టులో కేసు కూడా వేశారు. నిబంధనల ప్రకారం మాతృదేశంలో 365 రోజులు ఉండకుండా విదేశాలలో ఉన్నారని… రమేష్‌ పౌరసత్వం చెల్లదని పిటిషన్‌ వేశారు.

పదేళ్లుగా రమేష్‌ పౌరసత్వ వివాదం కొనసాగుతోంది. ఈవివాదం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు అక్కడి నుంచి కేంద్ర హోంశాఖ…మళ్లీ తిరిగి హైకోర్టుకు చేరింది. దీంతో 2019 జులై 23న కేంద్ర హోంశాఖ ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. ముగ్గురు సభ్యులు ఇచ్చిన నివేదిక పునఃపరిశీలించి 12 వారాల్లో పౌరసత్వంపై తేల్చాలని కేంద్ర హోంశాఖను హైకోర్టు తిరిగి ఆదేశించింది.

దీంతో ఇటీవల ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ బోర్డర్‌ మేనేజ్‌మెంట్‌ సెక్రటరీ నార్త్‌ బ్లాక్‌లో ఇరు పక్షాలు వాదనలు వినిపించాయి. కోర్టు ఇచ్చిన 12 వారాల గడువు ముగియడంతో బోర్డర్‌ మేనేజ్‌మెంట్‌ ఇప్పుడు కీలక తీర్పు వెలువరించింది. రమేష్ పౌరసత్వం చెల్లదని కమిటీ రిపోర్టు ఆధారంగా కేంద్ర హోంశాఖ తేల్చింది.

రమేష్‌ పౌరసత్వం రద్దుతో వేములవాడకు ఉప ఎన్నిక వస్తుందా? అనే చర్చ మొదలైంది. రమేష్‌ ఇప్పుడు మళ్లీ హైకోర్టు వెళతారని తెలుస్తోంది. అయితే కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఈసీకి ఏం డైరెక్షన్‌ ఇస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    
Advertisement

Similar News