ఉదయ్‌ భాస్కర్‌పై త్వరలో మూడు కేసులు...

ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్‌ భాస్కర్‌ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. చంద్రబాబు హయాంలో నియమితులైన ఉదయ్ భాస్కర్‌పై తొలి నుంచి కూడా అనేక ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఆయన చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. గ్రామ సచివాలయ పరీక్షలు నిర్వహించినప్పుడు ఒక పత్రిక పనిగట్టుకుని వ్యతిరేక కథనాలు రాసినప్పుడు ఉదయ్‌ భాస్కర్‌ తీరుపై ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది. ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి రాజ్యాంగబద్దమైన పదవి కావడంతో తనను తొలగించడం ప్రభుత్వానికి అంత ఈజీ కాదన్న ధైర్యంతో ఉదయ్‌ […]

Advertisement
Update:2019-11-20 04:26 IST

ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్‌ భాస్కర్‌ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. చంద్రబాబు హయాంలో నియమితులైన ఉదయ్ భాస్కర్‌పై తొలి నుంచి కూడా అనేక ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఆయన చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.

గ్రామ సచివాలయ పరీక్షలు నిర్వహించినప్పుడు ఒక పత్రిక పనిగట్టుకుని వ్యతిరేక కథనాలు రాసినప్పుడు ఉదయ్‌ భాస్కర్‌ తీరుపై ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది. ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి రాజ్యాంగబద్దమైన పదవి కావడంతో తనను తొలగించడం ప్రభుత్వానికి అంత ఈజీ కాదన్న ధైర్యంతో ఉదయ్‌ భాస్కర్ పనిచేస్తున్నారన్న అభిప్రాయం ఉంది.

ఉదయ్‌ భాస్కర్ చిట్టాను ప్రభుత్వం సిద్దం చేస్తోందన్న వార్తల నేపథ్యంలో ఉదయ్‌ భాస్కర్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డాడు. ఆలోపే చైర్మన్‌ పదవి నుంచి తప్పుకుంటే ఎలా ఉంటుందన్న దానిపై ఆయన ఆలోచన చేస్తున్నాడు.

ప్రస్తుతం కార్యాలయ సిబ్బంది కూడా ఉదయ్ భాస్కర్ పట్ల అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తన చాంబర్‌ వద్ద సీసీ కెమెరాలను కూడా తొలగించారని… కనీసం సిబ్బంది తన చాంబర్‌కు సకాలంలో తలుపులు కూడా తీయడం లేదని ఉదయ్‌ భాస్కర్ వాపోతున్నారని టీడీపీ అనుకూల పత్రిక కథనాన్ని రాసింది.

ఇప్పటికే ఉదయ్ భాస్కర్‌కు సంబంధించిన వ్యవహారాలను గుర్తించిన ప్రభుత్వం త్వరలోనే ఆయనపై మూడు కేసులు పెట్టేందుకు సిద్ధమైనట్టు సదరు పత్రిక వివరించింది. ఈ అంశాన్ని సన్నిహితుల వద్ద ప్రస్తావించిన ఉదయ్ భాస్కర్‌…తాను చైర్మన్‌ పదవి నుంచి తప్పుకుంటే వివాదం ఉండదన్న ఆలోచనను వ్యక్తపరిచారట.

ప్రభుత్వం తనపై చర్యలు తీసుకోబోతోందని ముందే గ్రహించిన ఉదయ్‌ భాస్కర్… ఇటీవల గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. గవర్నర్‌ను కలిసి పరిస్థితిని వివరించారు.

గవర్నర్‌ వద్దకు ఉదయ్ భాస్కర్ వెళ్తున్న విషయం తెలుసుకున్న ప్రభుత్వం ముందే ఈయన వ్యవహారశైలి, ఏపీపీఎస్సీలో ఈయన నేతృత్వంలో జరిగిన అవకతవకలను గవర్నర్‌కు వివరించింది.

దాంతో గవర్నర్ వద్ద ఉదయ్ భాస్కర్‌కు సానుకూల పరిస్థితి ఎదురుకాలేదు. ఈ నేపథ్యంలో రాజీనామా చేసి తప్పుకుంటే ఎలా ఉంటుందన్న దానిపై రెండుమూడు రోజుల్లో ఉదయ్ భాస్కర్ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News