రేషన్ కార్డ్ ప్లేస్‌లో ప్రత్యేక గుర్తింపు కార్డులు !
ఏపీలో బుధవారం నుంచి వైఎస్‌ఆర్ నవశకం ప్రారంభం కాబోతుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడడం…అనర్హుల్ని లబ్థిదారుల జాబితా నుంచి తొలగించడం ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. అంతేకాదు… భవిష్యత్ అవసరాల కోసం ప్రణాళిక రూపొందించడం మరో ముఖ్య అంశం. ఇప్పటివరకూ రేషన్ కార్డు అన్ని పథకాలకు ప్రామాణికంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ రూల్ ను మారుస్తున్నారు. ఇక నుంచి ముఖ్యమైన పథకాలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు రాబోతున్నాయి. వీటి ఆధారంగానే […]
ఏపీలో బుధవారం నుంచి వైఎస్‌ఆర్ నవశకం ప్రారంభం కాబోతుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడడం…అనర్హుల్ని లబ్థిదారుల జాబితా నుంచి తొలగించడం ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. అంతేకాదు… భవిష్యత్ అవసరాల కోసం ప్రణాళిక రూపొందించడం మరో ముఖ్య అంశం.
ఇప్పటివరకూ రేషన్ కార్డు అన్ని పథకాలకు ప్రామాణికంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ రూల్ ను మారుస్తున్నారు. ఇక నుంచి ముఖ్యమైన పథకాలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు రాబోతున్నాయి. వీటి ఆధారంగానే భవిష్యత్‌లో ఆ పథకాల లబ్ధి అందబోతోంది.
కొత్తగా వచ్చే కార్డులు
1. ప్రజా పంపిణీ బియ్యం కార్డులు
2. పింఛన్ కార్డు
3. ఆరోగ్య శ్రీకార్డు
4. విద్యా దీవెన
ప్రభుత్వం నూతనంగా అమలు చేయబోతున్న పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నవశకం సర్వే ద్వారా జరగబోతుంది.
- వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా
- వైఎస్‌ఆర్ నేతన్న హస్తం
- డ్వాక్రా రుణాలకు సున్నా వడ్డీ పథకం
- అమ్మబడి
- దర్జీలు,రజకులు, నాయీ బ్రాహ్మణులకు రూ 10వేలు ఏటా నగదు ప్రోత్సాహకాన్ని అందజేసే పథకం
- కాపు మహిళలకు సాయం చేసే పథకం
- అర్చకులు, ఇమాం, మౌజిన్, పాస్టర్లకు గౌరవ వేతనాలు…
ఇలా వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపికకు…. ఈ సర్వేను ప్రామాణికంగా తీసుకోనున్నారు. 9 రకాల దరఖాస్తు ఫారాలను వాలంటీర్లకు అంజేసి ఇంటింటికి వెళ్లినపుడు అర్హుల వివరాలతో వాటిని పూరించనున్నారు.
ఈనెల 20 నుంచి నెల రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వాలంటీర్ ను నియమించారు. తమకు కేటాయించిన 50 కుటుంబాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తారు. ఆయా ఇళ్లలో మృతి చెందినవారు, వివాహాలై అత్తారింటికి వెళ్లిన వారు…. ఇతర ప్రాంతాల్లో దీర్ఘకాలంగా ఉంటూ… ఇక్కడ లబ్ధిపొందుతున్న వారిని గుర్తించి జాబితా నుంచి తొలగిస్తారు.
అదే సమయంలో గతంలో నమోదవ్వని కుటుంబాల వివరాలను నూతనంగా చేరుస్తారు. వాలంటీర్‌కు ఒక అండ్రాయిడ్ ఫోన్ కూడా అందజేస్తారు. వారి ఆధార్ వివరాల ఆధారంగా యూజర్ ఐడీ… పాస్‌వర్డ్ కేటాయించనున్నారు.
వాలంటీర్లకు గ్రామాల్లో రోజుకు ఐదు, పట్టణాల్లో పది గృహాల సర్వే పూర్తి చేయడం లక్ష్యంగా నిర్దేశించారు. ఈ సర్వేలో సేకరించిన వివరాలతో కూడిన ముసాయిదా జాబితాను వచ్చే నెల 9న వార్డు, గ్రామస్థాయి సచివాలయాల్లో ప్రచురిస్తారు. వాటిపై అభ్యంతరాలను అదే నెల 13వ తేదీ వరకు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించి 15వ తేది నుంచి 18 వరకు తుది జాబితాలు రూపొందిస్తారు. 20 నుంచి అర్హులకు ఆయా సంక్షేమ పథకాలకు సంబంధించి కార్డులు జారీ చేస్తారు.
వచ్చే నెల 20 లోపు కొత్త కార్డులు అర్హులకు అందించేలా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.