ప్రపంచ నంబర్ వన్ రాఫెల్ నడాల్
ఐదోసారి టాప్ ర్యాంక్ లో స్పానిష్ బుల్ ప్రపంచ టెన్నిస్ పురుషుల ర్యాంకింగ్స్ లో స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. 2019 సీజన్ ను నంబర్ వన్ ర్యాంక్ తో ముగించాడు. లండన్ లో ఏటీపీ టూర్ సీజన్ ముగింపు టోర్నీ ఫైనల్స్ ముగిసిన వెంటనే ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం నడాల్ టాప్ ర్యాంకర్ గా నిలిచాడు. 2019 గ్రాండ్ స్లామ్ సీజన్లో చెరో రెండు టైటిల్స్ చొప్పున నెగ్గిన నడాల్, జోకోవిచ్ […]
- ఐదోసారి టాప్ ర్యాంక్ లో స్పానిష్ బుల్
ప్రపంచ టెన్నిస్ పురుషుల ర్యాంకింగ్స్ లో స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. 2019 సీజన్ ను నంబర్ వన్ ర్యాంక్ తో ముగించాడు. లండన్ లో ఏటీపీ టూర్ సీజన్ ముగింపు టోర్నీ ఫైనల్స్ ముగిసిన వెంటనే ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం నడాల్ టాప్ ర్యాంకర్ గా నిలిచాడు.
ఆస్ట్ర్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్స్ ను జోకోవిచ్, ఫ్రెంచ్ , యూఎస్ ఓపెన్ టైటిల్స్ ను నడాల్ గెలుచుకోగా…ఫెదరర్ వరుసగా రెండో ఏడాది మూడో ర్యాంక్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
వింబుల్డన్ లో రన్నరప్, ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్స్ చేరిన రికార్డు ఉంది. 38 సంవత్సరాల ఫెదరర్ కు 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో పాటు 103 టూర్ టైటిల్స్ విజేతగా నిలిచిన రికార్డు సైతం ఉంది.
నడాల్ తన కెరియర్ లో టాప్ ర్యాంక్ లో నిలవడం ఇది ఐదోసారి. టెన్నిస్ చరిత్రలో జోకోవిచ్, ఫెదరర్, నడాల్ తలో ఐదుసార్లు టాప్ ర్యాంక్ సాధిస్తే… అమెరికన్ ప్లేయర్ పీట్ సాంప్రాస్ కు మాత్రమే అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన ఘనత ఉంది.
ఆస్ట్ర్రియా ఆటగాడు డోమనిక్ థీమ్ నాలుగు, డేనియల్ మెద్వదేవ్ ఐదు, సిటిస్ పాస్ ఆరు ర్యాంకులతో 2019 సీజన్ ను ముగించగలిగారు.