బాబుకు ఈ అసెంబ్లీ సమావేశాలు మహా ఇబ్బందికరమే !

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళయింది. తొందరలోనే 15 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. ఈసారి సమావేశాలు వాడివేడిగా సాగడం ఖాయమనిపిస్తోంది. ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుల మధ్య మాటల తూటాలు పేలడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కూడా కాకముందే ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం, చాలా సమస్యలను టీడీపీ ఎత్తిచూపింది. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అభాసుపాలు అవుతోంది. ఇక […]

Advertisement
Update:2019-11-18 11:21 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళయింది. తొందరలోనే 15 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. ఈసారి సమావేశాలు వాడివేడిగా సాగడం ఖాయమనిపిస్తోంది. ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుల మధ్య మాటల తూటాలు పేలడం ఖాయంగా కనిపిస్తోంది.

ఏపీలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కూడా కాకముందే ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం, చాలా సమస్యలను టీడీపీ ఎత్తిచూపింది. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అభాసుపాలు అవుతోంది. ఇక జగన్ సైతం దీనిపై కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీ నేతలు అటాక్ చేస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాలు మొదలైతే ఇది మరింత రక్తికట్టే అవకాశాలు లేకపోలేదు. పోయిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును చెడుగుడు ఆడేసిన జగన్ ఈసారి ఎలాంటి ఎత్తులు వేస్తాడు.? చంద్రబాబును ఎలా అటాక్ చేస్తాడనేది ఆసక్తిగా మారింది.

ఇక చంద్రబాబుకు నేతలు జారిపోవడం పెద్ద మైనస్ గా మారింది. ఇప్పటికే గంటా సహా ఉత్తరాంద్ర నేతలు మౌనం దాల్చారు. వల్లభనేని వంశీ బయటకొచ్చాడు. ఆయన తడాఖా ఈసారి అసెంబ్లీ సాకిగా చంద్రబాబు మీదే కావొచ్చు.

మొన్న చంద్రబాబు దీక్షకు ఎవరూ హాజరు కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఒంటరి అయిన చంద్రబాబు అసెంబ్లీలో 151 మంది సభ్యులున్న ప్రతిపక్ష వైసీపీని ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తిగా మారింది. మరి 40 ఇయర్స్ బాబుకు ఈ అసెంబ్లీ సమావేశాలు కత్తిమీద సామే.

Tags:    
Advertisement

Similar News