ఇంగ్లీష్ రాకుంటే దేశవిదేశాల్లో తెలుగు బిడ్డల రాణింపు కష్టం
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వాగతించారు. ఇది మంచి నిర్ణయమన్నారు. అన్నవరంలో ఈ అంశంపై స్పందించిన స్వరూపానందేంద్ర… జగన్ నిర్ణయానికి తన ఆశీర్వాదం ఉంటుందన్నారు. భావితరాలు ఎదగడానికి ఇంగ్లీష్ ఎంతో అవసరమని… ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే సామాన్య, పేద విద్యార్థులు కూడా ఉన్నతస్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుత కాలంలో బతకడానికి, బతుకుదెరువుకు ఇంగ్లీష్ అవసరం ఉందని.. ఇంగ్లీష్ […]
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వాగతించారు. ఇది మంచి నిర్ణయమన్నారు. అన్నవరంలో ఈ అంశంపై స్పందించిన స్వరూపానందేంద్ర… జగన్ నిర్ణయానికి తన ఆశీర్వాదం ఉంటుందన్నారు.
భావితరాలు ఎదగడానికి ఇంగ్లీష్ ఎంతో అవసరమని… ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే సామాన్య, పేద విద్యార్థులు కూడా ఉన్నతస్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందన్నారు.
ప్రస్తుత కాలంలో బతకడానికి, బతుకుదెరువుకు ఇంగ్లీష్ అవసరం ఉందని.. ఇంగ్లీష్ రాకుంటే దేశ, విదేశాల్లో ఉన్న మన తెలుగు బిడ్డలు రాణించడం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు.
ఇంగ్లీష్ కారణంగానే ఏపీ, తెలంగాణకు చెందిన వారు ఎందరో దేశ, విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. అదే సమయంలో కన్నతల్లి లాంటి తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు.