జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేష్ రెడ్డిపై ఏసీబీ దాడులు

జేసీ దివాకర్‌ రెడ్డి మాజీ పీఏ సురేష్ రెడ్డిపై ఏసీబీ దాడి చేసింది. సురేష్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. పంచాయతీ రాజ్ శాఖలో ఏఈఈగా పని చేస్తున్న సురేష్‌ రెడ్డి… జేసీ ఎంపీగా ఉన్న సమయంలో ఆయనకు పీఏగా పనిచేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణపై ఏసీబీ దాడులు చేసింది. జేసీ దివాకర్ రెడ్డిని అడ్డుపెట్టుకుని అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక దశలో సురేష్ రెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చేందుకు జేసీ ప్రయత్నించారు. పుట్టపర్తి, […]

Advertisement
Update:2019-11-15 06:21 IST

జేసీ దివాకర్‌ రెడ్డి మాజీ పీఏ సురేష్ రెడ్డిపై ఏసీబీ దాడి చేసింది. సురేష్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. పంచాయతీ రాజ్ శాఖలో ఏఈఈగా పని చేస్తున్న సురేష్‌ రెడ్డి… జేసీ ఎంపీగా ఉన్న సమయంలో ఆయనకు పీఏగా పనిచేశారు.

ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణపై ఏసీబీ దాడులు చేసింది. జేసీ దివాకర్ రెడ్డిని అడ్డుపెట్టుకుని అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక దశలో సురేష్ రెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చేందుకు జేసీ ప్రయత్నించారు.

పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లో సురేష్‌ రెడ్డి, అతని కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై ఏసీబీ బృందాలు ఏక కాలంలో దాడులు చేశాయి.

కోట్లాది రూపాయలు ఆదాయానికి మించి ఉన్నట్టు గుర్తించారు. పల్లె రఘునాథరెడ్డికి చెక్ పెట్టి పుట్టపర్తి టీడీపీ టికెట్ సురేష్ రెడ్డికి ఇప్పించాలని జేసీ భావించారు. ఈ వివాదంలో జేసీ వర్గానికి, పల్లెకు మధ్య పెద్ద వివాదం గతంలో నడిచింది.

Tags:    
Advertisement

Similar News