ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు – చిత్తూరు జాతీయ రహదారిపై సీసాల లోడుతో వెళ్తున్న కంటెయినర్ బ్రేకులు విఫలమై ఒక వ్యాన్, ఆటో, ద్విచక్రవాహనంపై నుంచి దూసుకెళ్లింది. ఆ తర్వాత బోల్తా పడటంతో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో 8 మంది ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. జాతీయ రహదారిపై మొగిలిఘాట్ వద్ద వేగంగా వచ్చిన కంటైయినర్ బ్రేకులు విఫలమై డివైడర్‌ను […]

Advertisement
Update:2019-11-09 01:15 IST

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు – చిత్తూరు జాతీయ రహదారిపై సీసాల లోడుతో వెళ్తున్న కంటెయినర్ బ్రేకులు విఫలమై ఒక వ్యాన్, ఆటో, ద్విచక్రవాహనంపై నుంచి దూసుకెళ్లింది. ఆ తర్వాత బోల్తా పడటంతో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో 8 మంది ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

జాతీయ రహదారిపై మొగిలిఘాట్ వద్ద వేగంగా వచ్చిన కంటైయినర్ బ్రేకులు విఫలమై డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్, ఆటో, బైక్‌పైకి దూసుకెల్లింది. దీంతో కంటెయినర్ కింద పడి అందరూ ఛిద్రమయ్యారు. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమై భీతావహంగా మారింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. క్లీనర్ తీవ్ర గాయాలతో పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పరామర్శకు వెళ్లి వస్తూ..

చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలానికి చెందిన రెడ్డి శేఖర్ కుటుంబం తమ బంధువుల ఇంట్లో ఒకరు చనిపోవడంతో వారిని పరామర్శించడానికి ఓమ్నీ వ్యానులో వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. పరామర్శకు వెళ్లిన వాళ్లు 8 మంది మృతి చెందడంతో మర్రిమాకులపల్లెలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

ఇక ద్విచక్రవాహనంపై వెళ్తున్న బలిజపల్లెకు చెందిన ఇద్దరు కూడా మరణించారు. అప్పటికే చీకటి పడటంతో పాటు దేహాలన్నీ ఛిద్రమవడంతో మృతులను గుర్తుపట్టడానికి వీలు లేకుండా పోయింది. మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద వార్త తెలిసిన వెంటనే చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తా సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయా అధికారులను ఆదేశించారు.

Tags:    
Advertisement

Similar News