నేడే అయోధ్య తీర్పు.. దేశమంతటా హై అలెర్ట్..!

యావత్ భారతదేశం అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్య భూ వివాదం కేసులో ఇవాళ ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పుడు వెలువరిస్తారు. వివాదాస్పద రామ జన్మభూమి – బాబ్రీ మసీదు కేసుగా పేరుగాంచిన ఈ కేసులో గత కొన్నాళ్లుగా సుప్రీంలో విచారణ జరిగింది. అక్టోబర్ 16న ముగిసిన ఈ కేసు వాదనలపై తుది తీర్పును ఇవాళ వెలువరించనున్నారు. కాగా, అయోధ్య […]

Advertisement
Update:2019-11-09 01:17 IST

యావత్ భారతదేశం అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్య భూ వివాదం కేసులో ఇవాళ ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పుడు వెలువరిస్తారు.

వివాదాస్పద రామ జన్మభూమి – బాబ్రీ మసీదు కేసుగా పేరుగాంచిన ఈ కేసులో గత కొన్నాళ్లుగా సుప్రీంలో విచారణ జరిగింది. అక్టోబర్ 16న ముగిసిన ఈ కేసు వాదనలపై తుది తీర్పును ఇవాళ వెలువరించనున్నారు.

కాగా, అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెడ్ అలెర్ట్ ప్రకటించారు. దేశంలోని కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న తీర్పు కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. అయోధ్య ఉన్న యూపీ రాష్ట్రంలో 40 వేల మంది పోలీసులు, పారామిలటరీ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

తీర్పు అనంతరం ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా బహిరంగ ప్రకటనలు చేసినా, సోషల్ మీడియాలో పోస్టులు ఉంచినా వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని యూపీ పోలీసులు హెచ్చరించారు. కేంద్ర హోం శాఖ కూడా ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయవద్దని ప్రజలకు, రాజకీయ నాయకులకు సూచించింది.

అయోధ్య వివాదంలో కేంద్ర బిందువుగా ఉన్నది 2.77 ఎకరాల స్థలం. కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చిన తర్వాత ఈ స్థలం వివాదంలో చిక్కుకుంది. కాగా, ఈ వివాదంపై నాలుగు సివిల్ దావాలు దాఖలు అవగా.. దానిపై 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్ లల్లాలు సమానంగా పంచుకోవాలని స్పష్టం చేసింది.

అయితే, ఈ తీర్పును సవాలు చేస్తే సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలు కావడంతో.. అలహాబాద్ కోర్టు తీర్పుపై స్టే విధించింది. ఇక ఈ ఏడాది అగస్టు 6 నుంచి అక్టోబర్ 16 వరకు రోజువారీగా రంజన్ గగోయ్ నేతృత్వంలోని జస్టీస్ ఎస్ఏ బోబ్డే, జస్టీస్ డీవై చంద్రచూడ్, జస్టీస్ ఎస్ఏ. నజీర్, జస్టీస్ అశోక్ భూషన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ తర్వాత తుది తీర్పును బెంచ్ రిజర్వ్ చేసింది. ఈ రిజర్వు తీర్పునే ఇవాళ వెల్లడించనున్నారు.

Tags:    
Advertisement

Similar News