అయోధ్య తుది తీర్పు... వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్ కు... సున్నీ బోర్డుకు 5ఎకరాల ప్రత్యామ్నాయ భూమి
దశాబ్దాలుగా నడుస్తున్న అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించింది. కిక్కిరిసిన కోర్టు హాల్‌లో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పును చదివి వినిపించారు. తీర్పును ఏకగ్రీవంగా ఇస్తున్నట్టు చెప్పారు. ఐదుగురు జడ్జీలు ఒకే మాటతో తీర్పు ఇస్తున్నట్టు వివరించారు. 1885కు ముందు కూడా హిందువులు అక్కడ పూజలు చేసేవారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ముస్లింలు కూడా మసీదును ఎప్పుడూ విడిచిపోలేదన్నారు. అక్కడ నమాజ్ చేసే హక్కు ముస్లింలకు ఉందన్నారు. వివాదాస్పద భూమి తమదే అని […]
దశాబ్దాలుగా నడుస్తున్న అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించింది. కిక్కిరిసిన కోర్టు హాల్‌లో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పును చదివి వినిపించారు. తీర్పును ఏకగ్రీవంగా ఇస్తున్నట్టు చెప్పారు. ఐదుగురు జడ్జీలు ఒకే మాటతో తీర్పు ఇస్తున్నట్టు వివరించారు.
1885కు ముందు కూడా హిందువులు అక్కడ పూజలు చేసేవారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ముస్లింలు కూడా మసీదును ఎప్పుడూ విడిచిపోలేదన్నారు. అక్కడ నమాజ్ చేసే హక్కు ముస్లింలకు ఉందన్నారు. వివాదాస్పద భూమి తమదే అని ముస్లిం సంస్థలు నిరూపించుకోలేకపోయాయని కోర్టు చెప్పింది. బాబ్రీ మసీదు కూల్చివేత రాజ్యాంగ విరుద్దమని… దీన్ని చట్టం అనుమతించదని కోర్టు తన తీర్పులో చెప్పింది.
ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని తీర్పు చెప్పింది. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మసీదు నిర్మాణం కోసం వేరే స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని అయోధ్య ట్రస్ట్‌కు కేటాయించాలని తీర్పు చెప్పింది. మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్‌ను కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని అయోధ్య ట్రస్ట్‌కు అప్పగించాలని తీర్పు చెప్పింది.
మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా అయోధ్యలోనే ఐదు ఎకరాల భూమిని సున్నీ బోర్డుకు కేటాయించాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆ భూములతో వారు ఏం చేసుకుంటారన్నది వారి ఇష్టమని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
బాబర్ కాలంలో మసీదు నిర్మాణం జరిగిందని సుప్రీం కోర్టు వెల్లడించింది. మసీదు నిర్మాణం తేదీపై స్పష్టత లేదన్నారు. అంతర్గతంగా ఉన్న నిర్మాణం ఇస్లామిక్ శైలిలో లేదని కోర్టు అభిప్రాయపడింది. బాబ్రీ మసీదు కింద మరో నిర్మాణం ఉన్నట్టు పురావస్తు శాఖ గుర్తించిందన్నారు. బాబ్రీ మసీదును ఖాళీ ప్రదేశంలో నిర్మించలేదన్నారు. కింద మరో నిర్మాణం ఉందని పురావస్తు శాఖ గుర్తించిందని కోర్టు చెప్పింది. 12వ శతాద్దం నుంచి 16 వ శతాబ్దం వరకు ఏం జరిగిందన్న దానిపై ఆధారాలు లేవన్నారు.
అయోధ్యలో రాముడు జన్మించాడన్నది నిర్వివాద అంశమని కోర్టు అభిప్రాయపడింది. మసీదు కోసం ఆలయాన్ని కూల్చివేసి మసీదు కట్టారన్న దానికి ఆధారాలు లేవని కోర్టు వ్యాఖ్యానించింది.
ప్రధాన డోమ్ కిందే రాముడు జన్మించాడని హిందువులు, చాలా మంది చరిత్రకారులు నమ్ముతారని కోర్టు చెప్పింది. కానీ విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా కోర్టు తీర్పులు ఇవ్వలేదని వ్యాఖ్యానించింది. న్యాయసూత్రాల ఆధారంగా మాత్రమే భూమి హక్కులను కల్పిస్తామన్నారు.
వివాదాస్పద భూమికి సంబంధించిన సరైన పత్రాలు ఉన్న వారికే ఆ భూమి దక్కుతుందని వ్యాఖ్యానించింది. భూమి తమదే అని ముస్లిం సంస్థలు నిరూపించుకోలేకపోయాయని కోర్టు అభిప్రాయపడింది.