తెలంగాణనూ తాకిన ఇసుక కొరత

ఇసుక కొరత తెలంగాణపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాల కారణంగా తెలంగాణలోనూ ఇసుక రీచ్‌లు నీట మునిగిపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. తెలంగాణలో ప్రతి రోజూ సగటున 60వేల మెట్రిక్ టన్నుల ఇసుక వినియోగం జరుగుతుండగా… అక్కడ కూడా ఆన్‌లైన్లో ప్రభుత్వమే ఇసుకను విక్రయిస్తోంది. ఆన్‌లైన్‌లో టన్ను ఇసుకను 600 రూపాయలకు తెలంగాణ ప్రభుత్వం విక్రయిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 50 ఇసుక రీచ్‌లు పనిచేస్తుండేవి. కానీ వరదల కారణంగా నదుల్లో ఇసుక తీయడం ఆగిపోయింది. ప్రస్తుతం […]

Advertisement
Update:2019-11-07 01:50 IST

ఇసుక కొరత తెలంగాణపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాల కారణంగా తెలంగాణలోనూ ఇసుక రీచ్‌లు నీట మునిగిపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి.

తెలంగాణలో ప్రతి రోజూ సగటున 60వేల మెట్రిక్ టన్నుల ఇసుక వినియోగం జరుగుతుండగా… అక్కడ కూడా ఆన్‌లైన్లో ప్రభుత్వమే ఇసుకను విక్రయిస్తోంది. ఆన్‌లైన్‌లో టన్ను ఇసుకను 600 రూపాయలకు తెలంగాణ ప్రభుత్వం విక్రయిస్తోంది.

తెలంగాణ వ్యాప్తంగా 50 ఇసుక రీచ్‌లు పనిచేస్తుండేవి. కానీ వరదల కారణంగా నదుల్లో ఇసుక తీయడం ఆగిపోయింది. ప్రస్తుతం 15 రీచ్‌ లలో మాత్రమే ఇసుక బయటకు వస్తోంది. దాంతో విపరీతమైన కొరత ఏర్పడింది.

అయితే తెలంగాణ ప్రభుత్వం వర్షాకాలంలో ఇబ్బందులు వస్తాయని ముందే గ్రహించి ఏప్రిల్, మే నెలల్లోనే స్టాక్‌ పాయింట్లకు భారీగా ఇసుకను తరలించి పెట్టింది. దాని వల్ల ఇప్పటి వరకు ఇబ్బంది రాలేదు. ఇప్పుడు స్టాక్ పాయింట్లలో ఇసుక తగ్గిపోతుండడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. దాంతో ఆన్‌లైన్‌లో పరిమితంగా మాత్రమే ఇసుక అనుమతులు జారీ చేస్తున్నారు. దీని కారణంగా బహిరంగ మార్కెట్‌లో ట్రాక్టర్ ఇసుక నాలుగు వేలకు ఎగబాకింది.

ప్లాస్టరింగ్‌కు వాడే చిన్న ఇసుకకు భారీగా డిమాండ్ ఏర్పడింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎక్కడా సన్న ఇసుక దొరకడం లేదు. ఈ పరిస్థితికి భారీ వర్షాలే కారణమని తెలంగాణ గనులశాఖ ఎండీ మల్సూరు వివరించారు.

వరద ఉన్న సమయంలో రీచ్‌ల నుంచి ఇసుక తీయడం సాధ్యం కాదని వివరించారు. ముందస్తు ప్రణాళికతో వర్షాకాలానికి ముందే ఇసుకను స్టాక్ పాయింట్లకు తరలించడం వల్ల ఇప్పటి వరకు 70 శాతం కొరతను ఎదుర్కోగలిగామని… మరికొన్ని రోజుల్లో వరదలు తగ్గగానే ఇసుక లభ్యత సాధారణ స్థాయికి చేరుకుంటుందని.. ఇది తాత్కాలిక సమస్య మాత్రమేనని ఆయన వివరించారు.

Tags:    
Advertisement

Similar News