డే-నైట్ టెస్టులో ధోనీ కామెంట్రీ
భారత మాజీ కెప్టెన్లకు కామెంటీటర్లుగా చాన్స్ భారత గడ్డపై జరుగనున్న మొట్టమొదటి అధికారిక డే-నైట్ టెస్ట్ మ్యాచ్ లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సైతం పాల్గొనబోతున్నాడు. ప్రస్తుతం తనకుతానుగా తాత్కాలిక రిటైర్మెంట్ తీసుకొన్న ధోనీ మిగిలిన భారత మాజీ కెప్టెన్లతో కలసి కోల్ కతా వేదికగా జరిగే డే-నైట్ టెస్టులో వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు. బంగ్లాదేశ్ తో నవంబర్ 22 నుంచి 25 వరకూ జరిగే టెస్టు మ్యాచ్ మొదటి రెండురోజుల ఆటలో భారత మాజీ టెస్ట్ […]
- భారత మాజీ కెప్టెన్లకు కామెంటీటర్లుగా చాన్స్
భారత గడ్డపై జరుగనున్న మొట్టమొదటి అధికారిక డే-నైట్ టెస్ట్ మ్యాచ్ లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సైతం పాల్గొనబోతున్నాడు. ప్రస్తుతం తనకుతానుగా తాత్కాలిక రిటైర్మెంట్ తీసుకొన్న ధోనీ మిగిలిన భారత మాజీ కెప్టెన్లతో కలసి కోల్ కతా వేదికగా జరిగే డే-నైట్ టెస్టులో వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు.
బంగ్లాదేశ్ తో నవంబర్ 22 నుంచి 25 వరకూ జరిగే టెస్టు మ్యాచ్ మొదటి రెండురోజుల ఆటలో భారత మాజీ టెస్ట్ కెప్టెన్లు మాత్రమే కామెంటీటర్లుగా వ్యవహరించేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు.
ప్రస్తుత కెప్టెన్ విరాట్ కొహ్లీ…ఓ ఆటగాడుగా, భారత సారథి హోదాలో ఫీల్డ్ లో ఉంటే…మిగిలిన కెప్టెన్లు మాత్రం తమ అనుభవాలను వ్యాఖ్యానం ద్వారా పంచుకోనున్నారు.
భారత్ కు రెండు ప్రపంచకప్ లు అందించిన ఏకైక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సైతం కామెంటీటర్ గా పాల్గోనున్నాడు.
రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే లాంటి మాజీ కెప్టెన్లు…డే-నైట్ టెస్టులో ఎంత వరకూ కామెంటీటర్లుగా ఉంటారన్నది అనుమానమే.