అగ్రిగోల్డ్ బాధితుల్లారా కంగారొద్దు... ఇది ఎగ్గొట్టే ప్రభుత్వం కాదు... వెతికి సాయం చేసే ప్రభుత్వం...
అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వ పెద్దలు అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేసేందుకు ఏ విధంగా ప్రయత్నించారో ప్రజలంతా చూశారన్నారు. పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను తాను స్వయంగా చూశానన్నారు. మాట ఇచ్చినట్టుగానే అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు సొమ్ము చెల్లిస్తున్నామన్నారు. 3లక్షల 70వేల మందికి ఇప్పుడు ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారు. కోర్టులో కేసు ఉన్నా సరే […]
అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వ పెద్దలు అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేసేందుకు ఏ విధంగా ప్రయత్నించారో ప్రజలంతా చూశారన్నారు. పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను తాను స్వయంగా చూశానన్నారు. మాట ఇచ్చినట్టుగానే అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు సొమ్ము చెల్లిస్తున్నామన్నారు. 3లక్షల 70వేల మందికి ఇప్పుడు ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారు.
కోర్టులో కేసు ఉన్నా సరే బాధితులకు సొమ్ము చెల్లించేందుకు ముందుకొచ్చామన్నారు. త్వరలోనే మిగిలిన బాధితులకు కూడా చెల్లింపులు చేస్తామన్నారు. ఆస్తులన్ని కోర్టు పరిధిలో ఉన్నా సరే కోర్టు నుంచి అనుమతి తీసుకుని బాధితులకు మేలు చేసేందుకు ముందుకొచ్చామన్నారు.
కుంభకోణం టీడీపీ హయాంలో జరిగినా సరే చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకపోగా… దురాశతో అగ్రిగోల్డ్ ఆస్తులు, భూములును కొట్టేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారన్నారు. తాము మాత్రం అధికారంలోకి వచ్చాక తొలి కేబినెట్‌లోనే బాధితులకు సొమ్ము చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులందరికీ మంచి జరుగుతుందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు ఎవరూ కంగారు పడవద్దని ధైర్యం చెప్పారు. తమ ప్రభుత్వం ఎలా సొమ్ము ఎగ్గొట్టాలి అని చూసే ప్రభుత్వం కాదని… ఎవరికైనా సొమ్ము అందకపోతే వారిని గుర్తించి న్యాయం చేసే ప్రభుత్వం తమది అని జగన్ చెప్పారు.