నా లేఖను ఆంధ్రజ్యోతి వక్రీకరించి ప్రచారం చేసింది... అందుకే బహిష్కరిస్తున్నా...

ఆంధ్రజ్యోతి మీడియాను బహిష్కరిస్తున్నట్టు కాపు నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఇసుక సమస్యపై ముఖ్యమంత్రికి కీలకమైన సలహా ఇస్తూ తాను లేఖ రాస్తే దాన్ని ఆంధ్రజ్యోతి మీడియా వక్రీకరించిదని ముద్రగడ ఫైర్ అయ్యారు. లేఖలోని కీలక అంశాలు, సూచనలు ప్రచురించకుండా, మీకు కావాల్సినవి ముక్కలు ముక్కలుగా ప్రచురించారని విమర్శించారు. చేతిలో పెన్ను, పేపర్ ఉంది కదా అని మీ ఇష్టారీతిని ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ముద్రగడ ప్రశ్నించారు. తీరు మార్చుకుని… జర్నలిజం విలువలను పాటించాలంటూ ఆంధ్రజ్యోతి ఎండీ […]

Advertisement
Update:2019-11-06 12:13 IST

ఆంధ్రజ్యోతి మీడియాను బహిష్కరిస్తున్నట్టు కాపు నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఇసుక సమస్యపై ముఖ్యమంత్రికి కీలకమైన సలహా ఇస్తూ తాను లేఖ రాస్తే దాన్ని ఆంధ్రజ్యోతి మీడియా వక్రీకరించిదని ముద్రగడ ఫైర్ అయ్యారు.

లేఖలోని కీలక అంశాలు, సూచనలు ప్రచురించకుండా, మీకు కావాల్సినవి ముక్కలు ముక్కలుగా ప్రచురించారని విమర్శించారు. చేతిలో పెన్ను, పేపర్ ఉంది కదా అని మీ ఇష్టారీతిని ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ముద్రగడ ప్రశ్నించారు.

తీరు మార్చుకుని… జర్నలిజం విలువలను పాటించాలంటూ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు ముద్రగడ లేఖ రాశారు. లేఖలో ఆయనేమన్నారంటే…

‘‘04-11-2019వ తేదీన ఇసుక విషయమై సలహా ఇస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాసి పత్రికలకు విడుదల చేశాను. నేనేమి మీలాగ అపర మేధావిని కాను. రాష్ట్రంలో ఇసుక కోసం ప్రజలు పడుతున్న బాధలు చూసి ఇసుక పాలసీ పక్కాగా రూపొందించే వరకు ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయండి అని లేఖలో రాసాను.

ఆంధ్రజ్యోతిలో ఆ వార్తను ముక్కలు చేసి ముఖ్యమైన సలహాను రాయకుండా దాచడం ఎంత వరకు న్యాయమని అడుగుతున్నాను. నేను లిఖిత పూర్వకంగా ఇచ్చిన సలహాను రాష్ట్రంలోనే కాదు. దేశంలో ఉన్న గౌరవ మేధావులను తప్పు అని చెప్పమనండి బేషరతుగా క్షమాపణ చెబుతాను.

నా సలహాను ఎందుకు పత్రికలో రాయకూడదని, రాయొద్దని హుకుం జారీ చేసారు. ప్రభుత్వాల వల్ల నష్టం జరిగినప్పుడు లొల్లి పెట్టడానికి ప్రింటు, ఎలక్ట్రానిక్‌ మీడియా మీకు ఉన్నాయి. మీ స్వేచ్చకు సంకెళ్లు వేయకూడదు.

మాలాంటి వారికి అలాంటివి జరిగినప్పుడు మా బాధను ఎక్కడ చెప్పుకున్నా న్యాయం జరగదు. మీ చేతిలో పెన్ను, కాగితాలు ఉన్నాయి కనుక మీ ఇష్టం. దయచేసి ఇక నుండి నా వార్తలు మీ ప్రింటు, ఎలక్ట్రానిక్‌ చానెల్‌లో చూపకండి. ఇక నుంచి మీ చానెల్‌ గాని, మీ పత్రిక గాని చూడదల్చుకోలేదు’ అని ఏబీఎన్‌ రాధాకృష్ణకు రాసిన లేఖలో ముద్రగడ స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News