విజయారెడ్డి కారు డ్రైవర్ కూడా మృతి
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిపై నిందితుడు సురేష్ పెట్రోల్ పోసి నిప్పటించిన సమయంలో ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన కారు డ్రైవర్ గురునాథం మంగళవారం ఉదయం కన్నుమూశాడు. అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. విజయారెడ్డిని రక్షించేందుకు ప్రయత్నించిన క్రమంలో గురునాథంకి మంటలు అంటుకున్నాయి. మంటల్లో అతడి శరీరం 85 శాతం కాలిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. గురునాథంకు భార్య , ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం గురునాథం భార్య గర్భవతి. ఏడాదిన్నరగా తహసీల్దార్ […]
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిపై నిందితుడు సురేష్ పెట్రోల్ పోసి నిప్పటించిన సమయంలో ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన కారు డ్రైవర్ గురునాథం మంగళవారం ఉదయం కన్నుమూశాడు. అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
విజయారెడ్డిని రక్షించేందుకు ప్రయత్నించిన క్రమంలో గురునాథంకి మంటలు అంటుకున్నాయి. మంటల్లో అతడి శరీరం 85 శాతం కాలిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. గురునాథంకు భార్య , ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు.
ప్రస్తుతం గురునాథం భార్య గర్భవతి. ఏడాదిన్నరగా తహసీల్దార్ విజయారెడ్డి వద్ద గురునాథం కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. నిన్న జరిగిన దాడిలో విజయారెడ్డి, డ్రైవర్ గురునాథంతో పాటు అటెండర్ చంద్రయ్య కూడా గాయపడ్డాడు. చంద్రయ్య శరీరం 50 శాతం కాలిపోయింది. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.