మళ్లీ కాపీ కొట్టిన చంద్రబాబు... కొత్త ఆలోచనలే రావా?

ఏపీలో ఇసుక రాజకీయం నడుస్తోంది. తెలంగాణలో కూడా ఇసుక కొరత ఉంది. హైదరాబాద్‌లో బిల్డర్లు అవస్థలు పడుతున్నారు. కానీ ఏపీలో మాత్రమే ఇసుక కొరత ఉన్నట్లు టీడీపీ నేతలకు కన్పిస్తోంది. సామాన్యునికి ఇబ్బంది లేదు. జనాలు ఇసుక గురించి పట్టించుకోవడం లేదు. కానీ తెలుగుదేశం, దాని అనుబంధ మీడియా సంస్థలు మాత్రం ఇసుక కొరత అంటూ ఊదరగొడుతున్నాయి. ఓ పార్టీకి చెందిన బిల్డర్లు మాత్రమే ఇసుక కొరత అంటూ మాట్లాడుతున్నారు. కానీ ఎవరెవరు ఇబ్బందులు పడుతున్నారో మాత్రం […]

Advertisement
Update:2019-11-05 10:25 IST

ఏపీలో ఇసుక రాజకీయం నడుస్తోంది. తెలంగాణలో కూడా ఇసుక కొరత ఉంది. హైదరాబాద్‌లో బిల్డర్లు అవస్థలు పడుతున్నారు. కానీ ఏపీలో మాత్రమే ఇసుక కొరత ఉన్నట్లు టీడీపీ నేతలకు కన్పిస్తోంది.

సామాన్యునికి ఇబ్బంది లేదు. జనాలు ఇసుక గురించి పట్టించుకోవడం లేదు. కానీ తెలుగుదేశం, దాని అనుబంధ మీడియా సంస్థలు మాత్రం ఇసుక కొరత అంటూ ఊదరగొడుతున్నాయి. ఓ పార్టీకి చెందిన బిల్డర్లు మాత్రమే ఇసుక కొరత అంటూ మాట్లాడుతున్నారు. కానీ ఎవరెవరు ఇబ్బందులు పడుతున్నారో మాత్రం చెప్పడం లేదు. ఇప్పటికీ నిర్మాణాలు ఆగిపోతే వీడియోల్లో హైలైట్ చేసేవారు. కానీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వేరే అంశం లేకపోవడంతో కృత్రిమ అంశాన్ని చేపట్టారు.

ఇప్పుడు ఇసుక కొరతపై చంద్రబాబు ఒక రోజు దీక్ష చేస్తారట. రెండు రోజుల కిందట నారా లోకేష్‌ ఐదు గంటల పాటు దీక్ష చేశారు. ఆ దీక్షను టీడీపీ నేతలే పట్టించుకోలేదు. ఇప్పుడు14వ తేదీన చంద్రబాబు 12 గంటల దీక్ష చేస్తారట. దీనిపై అప్పుడే సెటైర్లు పడుతున్నాయి.

మూడేళ్ల కిందట ప్రజా సమస్యలపై జగన్‌ రెండు రోజుల దీక్ష చేస్తే ఇవేమి దీక్షలు అంటూ ఎల్లో బ్యాచ్‌ అవహేళన చేసింది. కానీ ఇప్పుడు జగన్‌ మోడల్‌నే కాపీ కొడుతున్నారు, కనీసం ఆందోళనలు,నిరసనలు కూడా కొత్తగా చేయలేరా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అన్నీ కాపీ కొట్టడమే చంద్రబాబుకు అలవాటుగా మారిందట.

మొత్తానికి టీడీపీ నేతల్లో కొత్తగా ఆలోచించేవారు లేరా? వారికి పని కల్పించడం లేదా? లోకేష్‌ టీమ్‌ ఏం చేస్తుంది? అని టీడీపీ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News