వేడెక్కనున్న ఆర్టీసీ సమ్మె.. జేఏసీ అనూహ్య నిర్ణయం..

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమై నెలరోజులు దగ్గరకు వస్తున్నా.. కార్మికులు మరణిస్తున్నా సమ్మెపై ఎలాంటి చర్యలు తీసుకోని కేసీఆర్ సర్కారుకు మరింత సెగ పుట్టించేందుకు ఆర్టీసీ జేఏసీ రెడీ అయ్యింది. తాజాగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ శనివారం హైదరాబాద్ లో సమావేశమైంది. కార్మికులంతా కలిసి ఉద్యమిస్తే సరిపోవడం లేదని.. ఈ విషయంలో ప్రజాసంఘాలను, రాజకీయ పార్టీలను, విద్యార్థి, మహిళా సంఘాలను కూడా కలుపుకోవాలని నిర్ణయించింది. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఈ మేరకు కీలక నిర్ణయాలను […]

Advertisement
Update:2019-11-02 15:03 IST

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమై నెలరోజులు దగ్గరకు వస్తున్నా.. కార్మికులు మరణిస్తున్నా సమ్మెపై ఎలాంటి చర్యలు తీసుకోని కేసీఆర్ సర్కారుకు మరింత సెగ పుట్టించేందుకు ఆర్టీసీ జేఏసీ రెడీ అయ్యింది.

తాజాగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ శనివారం హైదరాబాద్ లో సమావేశమైంది. కార్మికులంతా కలిసి ఉద్యమిస్తే సరిపోవడం లేదని.. ఈ విషయంలో ప్రజాసంఘాలను, రాజకీయ పార్టీలను, విద్యార్థి, మహిళా సంఘాలను కూడా కలుపుకోవాలని నిర్ణయించింది.

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఈ మేరకు కీలక నిర్ణయాలను ప్రకటించారు. నవంబర్ 3 నుంచి సరికొత్త ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఆర్టీసీ డిపోల వద్ద, గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 4న రాజకీయ పార్టీలతో డిపోల దగ్గర దీక్షలు, 5న సడక్ బంద్, 6న రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద దీక్షలు, 7న ఆర్టీసీ కార్మిక కుటుంబాలు, రాజకీయ పార్టీలతో డిపోల ఎదుట దీక్షలు చేయాలని నిర్ణయించారు. 8న ఛలో ట్యాంక్ బండ్, 9న ట్యాంక్ బండ్ పై దీక్షతో నిరసనకు ప్లాన్ చేశారు.

అయితే నవంబర్ 9న ట్యాంక్ బండ్ పై మిలియన్ మార్చ్ చేస్తామని ఆర్టీసీ జేఏసీ యోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమ కాలంలో ఈ తరహా ఉద్యమంతోనే కేంద్రం దిగివచ్చిన దృష్ట్యా 9న తెలంగాణ వ్యాప్తంగా పార్టీలు, ప్రజలను కూడగట్టి మిలియన్ మార్చ్ నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ యోచిస్తోంది. మరి ఇది వర్కవుట్ అవుతుందా లేదా అన్నది వేచిచూడాలి.

Tags:    
Advertisement

Similar News