పవన్ కల్యాణ్ కొత్త సినిమా.... అధికారిక ప్రకటన

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మళ్లీ ముఖానికి రంగేసుకోబోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీతో పాటు ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి చెందడంతో… తిరిగి సినిమాల్లో నటిస్తారా అన్న దానిపై చర్చ మొదలైంది. ఈ చర్చను నిజం చేస్తూ పవన్ కల్యాణ్ మళ్లీ నటించబోతున్నారు. హిందీలో హిట్ అయిన పింక్‌ సినిమా… తెలుగు రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటించబోతున్నారు. ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత దిల్ రాజ్‌తో కలిసి […]

Advertisement
Update:2019-11-02 08:54 IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మళ్లీ ముఖానికి రంగేసుకోబోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీతో పాటు ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి చెందడంతో… తిరిగి సినిమాల్లో నటిస్తారా అన్న దానిపై చర్చ మొదలైంది. ఈ చర్చను నిజం చేస్తూ పవన్ కల్యాణ్ మళ్లీ నటించబోతున్నారు.

హిందీలో హిట్ అయిన పింక్‌ సినిమా… తెలుగు రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటించబోతున్నారు. ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత దిల్ రాజ్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మించబోతున్నారు. వేణుశ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు.

ఈ సినిమాపై ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. హిందీలో పింక్‌ సినిమాలో అమితాబ్ నటించారు. తమిళంలోనూ ఈ సినిమాను అజిత్‌తో రీమేక్ చేశారు. ఇప్పుడు తెలుగులో పవన్ కల్యాణ్ ఈ సినిమాలో నటించబోతున్నారు. 2018లో అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయాల వైపు వెళ్లారు. ఇకపై సినిమాల్లో నటించబోనని ఆ సమయంలో చెప్పారు.

Tags:    
Advertisement

Similar News