భారత హాకీజట్లను ఊరిస్తున్న ఒలింపిక్స్ బెర్త్ లు

మహిళల విభాగంలో నేడే అమెరికాతో ఢీ పురుషుల విభాగంలో రష్యాతో అమీతుమీ టోక్యో ఒలింపిక్స్ హాకీ అర్హత టోర్నీలో..భారత పురుషుల, మహిళల జట్లు హాట్ ఫేవరెట్లుగా పోటీకి దిగుతున్నాయి. భువనేశ్వర్ లోని ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలో …మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే డబుల్ లెగ్ సమరంలో…రష్యా పురుషుల, అమెరికా మహిళల జట్లతో భారత జట్లు పోటీపడనున్నాయి. పురుషుల అర్హత పోటీలో…22వ ర్యాంకర్ రష్యాపైన భారత్ అలవోక విజయం సాధించే అవకాశం ఉంది. మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారతజట్టు 5వ […]

Advertisement
Update:2019-11-01 09:06 IST
  • మహిళల విభాగంలో నేడే అమెరికాతో ఢీ
  • పురుషుల విభాగంలో రష్యాతో అమీతుమీ

టోక్యో ఒలింపిక్స్ హాకీ అర్హత టోర్నీలో..భారత పురుషుల, మహిళల జట్లు హాట్ ఫేవరెట్లుగా పోటీకి దిగుతున్నాయి. భువనేశ్వర్ లోని ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలో …మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే డబుల్ లెగ్ సమరంలో…రష్యా పురుషుల, అమెరికా మహిళల జట్లతో భారత జట్లు పోటీపడనున్నాయి.

పురుషుల అర్హత పోటీలో…22వ ర్యాంకర్ రష్యాపైన భారత్ అలవోక విజయం సాధించే అవకాశం ఉంది. మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారతజట్టు 5వ ర్యాంకర్ గా… ప్రత్యర్థి రష్యా కంటే ఎన్నో రెట్లు బలమైన జట్టుగా కనిపిస్తోంది.

గ్రాహం రీడ్ శిక్షణలో అత్యంత పటిష్టమైన జట్టుగా రూపుదిద్దుకొన్న భారతజట్టు కీలక సభ్యుల్లో…సురేంద్ర కుమార్, హర్మన్ ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, బీరేంద్ర లాక్రా, మన్ ప్రీత్ సింగ్, నీలకంఠ శర్మ, హార్ధిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, ఆకాశ్ దీప్ సింగ్, సునీల్ , రమణ్ దీప్ సింగ్, సిమ్రన్ జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ, గోల్ కీపర్ శ్రీజేశ్ ఉన్నారు.

భారత్ కు రష్యా ఏమాత్రం పోటీ ఇవ్వగలదన్నది అనుమానమే. నేడు, రేపు జరిగే ఈ డబుల్ లెగ్ సమరంలో అత్యధిక గోల్స్ సాధించిన జట్లకు …టోక్యో ఒలింపిక్స్ బెర్త్ లు ఖాయమవుతాయి.

భారత మహిళలకు అమెరికా టెన్షన్..

మహిళల విభాగంలో అమెరికాతో భారత్ తాడోపేడో తేల్చుకోనుంది. ర్యాంకింగ్స్ లో అమెరికా కంటే భారత్ దే పైచేయిగా ఉన్నా విజయం ఏమంత తేలిక కాదు. అమెరికాను అత్యంత ప్రమాదకరమైన ప్రత్యర్థిగా భారతజట్టు పరిగణిస్తోంది.

అమెరికా 22వ ర్యాంక్ లో ఉంటే…భారత్ మాత్రం 9వ ర్యాంక్ లో కొనసాగుతోంది. అయితే…అమెరికా ప్రత్యర్థిగా భారత్ కు 4 విజయాలు, 22 పరాజయాల రికార్డు ఉంది.

రాణీ రాంపల్ నాయకత్వంలోని భారతజట్టులోని ఇతర సభ్యుల్లో గుర్జీత్ కౌర్, లైరెమ్ సియామీ, గోల్ కీపర్ సవిత ఉన్నారు.

భువనేశ్వర్ లో మరికొద్ది గంటల్లో ప్రారంభయ్యే ఈ పోటీల తొలి అంచెలో నెగ్గిన జట్లకు ఒలింపిక్స్ బెర్త్ దాదాపుగా ఖాయమైనట్లే అవుతుంది.

Tags:    
Advertisement

Similar News