72 పింక్ బాల్స్ తో డే-నైట్ టెస్ట్

భారత గడ్డపై మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ కు కౌంట్ డౌన్ క్రికెట్ క్రేజీ భారత గడ్డపై మరికొద్ది వారాల్లో జరిగే మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ నిర్వహించాడనికి ఆతిధ్య బీసీసీఐ…మొత్తం 72 గులాబీ రంగు బంతులకు ఆర్డర్ ఇచ్చింది. ఎస్ జీ బ్రాండ్ క్రికెట్ బాల్స్ తయారు చేసే సంస్థకు సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని బీసీసీఐ ఇండెంట్ పంపింది. 22 నుంచి ఈడెన్ గార్డెన్స్ లో డే-నైట్ టెస్ట్ గత కొద్ది దశాబ్దాలుగా పట్టపగలు…సహజసిద్ధమైన వెలుగులో జరుగుతున్న సాంప్రదాయ […]

Advertisement
Update:2019-11-01 11:20 IST
  • భారత గడ్డపై మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ కు కౌంట్ డౌన్

క్రికెట్ క్రేజీ భారత గడ్డపై మరికొద్ది వారాల్లో జరిగే మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ నిర్వహించాడనికి ఆతిధ్య బీసీసీఐ…మొత్తం 72 గులాబీ రంగు బంతులకు ఆర్డర్ ఇచ్చింది.

ఎస్ జీ బ్రాండ్ క్రికెట్ బాల్స్ తయారు చేసే సంస్థకు సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని బీసీసీఐ ఇండెంట్ పంపింది.
22 నుంచి ఈడెన్ గార్డెన్స్ లో డే-నైట్ టెస్ట్ గత కొద్ది దశాబ్దాలుగా పట్టపగలు…సహజసిద్ధమైన వెలుగులో జరుగుతున్న సాంప్రదాయ టెస్ట్ మ్యాచ్ లను…డే-నైట్ గా నిర్వహించడం ప్రారంభమయ్యింది.

ఆస్ట్ర్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ లాంటి దేశాలు ప్రయోగత్మకంగా ఇప్పటికే డే- నైట్ టెస్ట్ మ్యాచ్ లను నిర్వహించడంలో విజయవంతమయ్యాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ కేంద్రమైన భారత్ మాత్రం…బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ చొరవ, పూనిక పుణ్యమా అంటూ…తొలిసారిగా డే- నైట్ టెస్ట్ మ్యాచ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా….

భారత క్రికెట్ మక్కా, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియం కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబర్ 22 నుంచి బంగ్లాదేశ్ తో డే- నైట్ టెస్ట్ మ్యాచ్ నిర్వహించబోతున్నారు.

ఫ్లడ్ లైట్ల వెలుగులో జరిగే టెస్ట్ మ్యాచ్ లో సాంప్రదాయ ఎరుపు రంగు బాల్స్ స్థానంలో గులాబీ రంగు బంతులను ఉపయోగించనున్నారు.

గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్లో దులీప్ ట్రోఫీ మ్యాచ్ లను డే-నైట్ గానే…ఆస్ట్ర్రేలియాలో తయారైన కూకాబురా బ్రాండ్ బాల్స్ తో నిర్వహిస్తూ వస్తున్నారు.

అయితే…భారత్ వేదికగా జరిగే డే-నైట్ టెస్ట్ మ్యాచ్ లో మాత్రం ఎస్జీ బ్రాండ్ బాల్స్ ను వాడాలని నిర్ణయించారు.

మ్యాచ్ కోసం 72 బాల్స్…

ఐదురోజులపాటు…నాలుగు ఇన్నింగ్స్ గా సాగే ఈ డే-నైట్ టెస్ట్ మ్యాచ్ నిర్వహించడం కోసం …బీసీసీఐ మొత్తం 72 బాల్స్ ను తమకు అందుబాటులో ఉంచాలని ఎస్జీ సంస్థకు ఆర్డర్ పెట్టింది.

మరోవైపు…దులీప్ ట్రోఫీలో పాల్గొన్న సీనియర్ క్రికెటర్ల సలహాలు,సూచనలు తీసుకొని..నాణ్యమైన బాల్స్ ను రూపొందించామని ఎస్జీ బ్రాండ్ సంస్థ డైరెక్టర్ పరాస్ ఆనంద్ చెబుతున్నారు.

భారత వాతావరణం, ప్రధానంగా ఈడెన్ గార్డెన్స్ పరిస్థితులకు అనుగుణంగా బాల్స్ ను రూపొందిస్తున్నట్లు వివరించారు.

దాదాకు సచిన్ హ్యాట్సాఫ్…

భారతగడ్డపై డే-నైట్ టెస్ట్ మ్యాచ్ నిర్వహించాలన్న సౌరవ్ గంగూలీ ఆలోచన అభినందనీయమని మాస్టర్ సచిన్ టెండుల్కర్ ప్రశంసించాడు. అయితే… ఈడెన్ గార్డెన్స్ లో మంచు ప్రభావం ఏవిధంగా ఉంటుందన్న అంశం పైనే టెస్ట్ మ్యాచ్ విజయవంతం కావడం ఆధారపడి ఉంటుందని మాస్టర్ అభిప్రాయపడ్డాడు.

భారత బౌలర్లు ప్రాక్టీసు సమయంలో…మ్యాచ్ కు వాడే గులాబీ రంగు బాల్స్ ను ఉపయోగించాలని సూచించాడు.

కొత్త బంతి, 5 ఓవర్లు, 30 ఓవర్లు, 50 ఓవర్లు వాడిన బంతులతో ప్రాక్టీసు చేస్తే ఉపయోగం ఉంటుందని సలహా ఇచ్చాడు.
మంచుకురిస్తే మాత్రం…సీమ్ లేదా స్పిన్ బౌలర్లకు…కష్టమైపోతుందని…మంచుతో తడసి ముద్దగా మారిన బంతితో బౌలింగ్ చేయడం అతిపెద్ద పరీక్షేనని మాస్టర్ అభిప్రాయపడ్డాడు.

Tags:    
Advertisement

Similar News