దిద్దుబాటు... వైసీపీ రంగులను తొలగించిన అధికారులు
రాష్ట్రంలో కొందరు అత్యుత్సాహవంతులు వైసీపీ రంగును కనిపించిన కట్టడానికల్లా పూయడం మొదలుపెట్టారు. వైసీపీ పెద్దలు ఇలాంటివి పట్టించుకునే పరిస్థితుల్లో లేకపోవడంతో ఎవరికి వారే నిర్ణయాలు తీసుకుని వాటర్ ట్యాంకులు, బోరు బావులు, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ మూడు రంగులు వేస్తూ వెళ్తున్నారు. కొందరి పిచ్చి ముదిరి శ్మశానానికి కూడా వైసీపీ రంగులు వేసుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి గానీ, వైసీపీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇప్పుడు ఏకంగా అనంతపురం జిల్లా అమలాపురం మండలం తమ్మిడేపల్లిలో జాతీయ […]
రాష్ట్రంలో కొందరు అత్యుత్సాహవంతులు వైసీపీ రంగును కనిపించిన కట్టడానికల్లా పూయడం మొదలుపెట్టారు. వైసీపీ పెద్దలు ఇలాంటివి పట్టించుకునే పరిస్థితుల్లో లేకపోవడంతో ఎవరికి వారే నిర్ణయాలు తీసుకుని వాటర్ ట్యాంకులు, బోరు బావులు, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ మూడు రంగులు వేస్తూ వెళ్తున్నారు.
కొందరి పిచ్చి ముదిరి శ్మశానానికి కూడా వైసీపీ రంగులు వేసుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి గానీ, వైసీపీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇప్పుడు ఏకంగా అనంతపురం జిల్లా అమలాపురం మండలం తమ్మిడేపల్లిలో జాతీయ జెండా మీద వైసీపీ రంగులు వేశారు. గ్రామ సచివాలయం గోడపై జాతీయ జెండా ఉండగా దాని స్థానంలో వైసీపీ రంగులు పూసేశారు. దీనిపై పెద్దెత్తున దుమారం రేగడంతో అధికారులు స్పందించారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన గ్రామ కార్యదర్శి ఆర్ ప్రకాశ్‌ను సస్పెండ్ చేశారు. అమలాపురం ఎంపీడీవో, స్థానిక ఎస్‌ఐ వెళ్లి గ్రామ సచివాలయాన్ని పరిశీలించారు. అప్పటికప్పుడు వైసీపీ రంగులను తొలగించి మొత్తం తెల్ల రంగు వేయించారు. రంగులు వేసే వారికి అవగాహన లేకపోవడం వల్లే జాతీయ జెండాపై వారు ఇలా ఇతర రంగులు వేశారని ఎంపీడీవో వివరించారు. కార్యదర్శిని సస్పెండ్ చేసినట్టు చెప్పారు.