శాకాహారంతోనే విజయహారం

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ అనుభవం భారత కెప్టెన్, వందల కోట్ల అధిపతి విరాట్ కొహ్లీ..గత ఏడాదికాలంగా శాకాహార మంత్రం జపిస్తున్నాడు. 2018 వరకూ మాంసాహారిగా ఉన్న విరాట్ గత ఏడాదే.. తన కెరియర్ ను దృష్టిలో ఉంచుకొని..ఫక్తు శాకాహారిగా మారాడు. ప్రపంచ క్రికెట్లోనే అసాధారణ ఫిట్ నెస్ కలిగిన ఏకైక క్రికెటర్ గా గుర్తింపు పొందిన విరాట్ కొహ్లీ.. భారతజట్టులోని ఎందరో యువక్రికెటర్లకు స్పూర్తిగా, ఆదర్శంగా నిలిచాడు. జీవితంలో ఏది సాధించాలన్నా..చక్కటి ఆరోగ్యం, మంచి ఆహారపు అలవాట్లు ఉండి […]

Advertisement
Update:2019-10-30 03:22 IST
  • భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ అనుభవం

భారత కెప్టెన్, వందల కోట్ల అధిపతి విరాట్ కొహ్లీ..గత ఏడాదికాలంగా శాకాహార మంత్రం జపిస్తున్నాడు. 2018 వరకూ మాంసాహారిగా ఉన్న విరాట్ గత ఏడాదే.. తన కెరియర్ ను దృష్టిలో ఉంచుకొని..ఫక్తు శాకాహారిగా మారాడు.

ప్రపంచ క్రికెట్లోనే అసాధారణ ఫిట్ నెస్ కలిగిన ఏకైక క్రికెటర్ గా గుర్తింపు పొందిన విరాట్ కొహ్లీ.. భారతజట్టులోని ఎందరో యువక్రికెటర్లకు స్పూర్తిగా, ఆదర్శంగా నిలిచాడు.

జీవితంలో ఏది సాధించాలన్నా..చక్కటి ఆరోగ్యం, మంచి ఆహారపు అలవాట్లు ఉండి తీరాలని తాను అనుభవ పూర్వకంగా తెలుసుకొన్నానని విరాట్ కొహ్లీ చెబుతున్నాడు.

క్రికెటర్ గా అంతర్జాతీయస్థాయిలో అత్యుత్తమంగా రాణించాలంటే శాకాహారాన్ని మించిన ఆహారం మరొకటి లేదని కొహ్లీ నమ్ముతున్నాడు.

తన ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, గింజధాన్యాలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నాడు. విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో శాకాహారం చేసిపెట్టడానికి వీలుగా…ఓ వ్యక్తిగత చెఫ్ ను సైతం నియమించుకొన్నాడు.

2008 లో అరంగేట్రం..

2008 సీజన్లో భారతజట్టులో సభ్యుడిగా చేరిన విరాట్ కొహ్లీ..గత పదిసంవత్సరాల పాటు మాంసాహారిగా మాత్రమే ఉన్నాడు. గత ఏడాదే శాకాహారిగా మారిన తనకు ఫిట్ నెస్ గణనీయంగా మెరుగుపడిందని, ఏకాగ్రత ఎంతోబాగుందని కొహ్లీ మురిసిపోతున్నాడు.

గంటల తరబడి ఫీల్డ్ లో గడిపినా…విశ్రాంతి లేకుండా సిరీస్ వెంట సిరీస్ ఆడుతూ వస్తున్నా తనకు అలసట,విసుగు అనేవి లేకుండా పోయాయని తెలిపాడు.

గేమ్ చేంజర్స్ పేరుతో ..శాకాహారం విలువను చాటిచెబుతూ వచ్చిన ఓ వీడియోను చూసిన తర్వాత తనకు జ్ఞానోదయమయ్యిందని.. మాంసాహారంతో సూపర్ ఫిట్ గా ఉండవచ్చుననే భ్రమ ఒక్కసారిగా తొలిగిపోయిందని కొహ్లీ చెప్పాడు.

జాకీ చాన్, ఆర్నాల్డ్ ష్వాజనెగర్ లతో జేమ్స్ కామెరూన్ రూపొందించిన గేమ్ చేంజర్స్ వీడియోను 2018 లో చూసిన వెంటనే తాను శాకాహారిగా మారాలని నిర్ణయించుకొన్నానని..శాకాహారిగా ఎంత ప్రయోజనముందో తనకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చిందని కొహ్లీ వివరించాడు.

ఈ సృష్టిలోనే అతిపెద్ద వన్యప్రాణి, అత్యంత బలమైన ఆఫ్రికా గజరాజు సైతం శాకాహారేనని అందరూ గుర్తుంచుకోక తప్పదు.

Tags:    
Advertisement

Similar News