శ్రీదేవి ఎన్నికపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం

తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా ఎన్నికపై వచ్చిన ఫిర్యాదుకు రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఏపీ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ కాదని ఆమె క్రిస్టియన్ అంటూ ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రపతి కార్యాలయానికి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫిర్యాదు చేసింది. తాను క్రిస్టియన్ అంటూ గతంలో శ్రీదేవి చెప్పిన వీడియోను ఉదహరిస్తూ ఫిర్యాదు చేశారు. దళితులు క్రిస్టియన్ మతంలోకి మారితే వారు […]

Advertisement
Update:2019-10-30 06:45 IST

తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా ఎన్నికపై వచ్చిన ఫిర్యాదుకు రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఏపీ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ కాదని ఆమె క్రిస్టియన్ అంటూ ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రపతి కార్యాలయానికి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫిర్యాదు చేసింది.

తాను క్రిస్టియన్ అంటూ గతంలో శ్రీదేవి చెప్పిన వీడియోను ఉదహరిస్తూ ఫిర్యాదు చేశారు. దళితులు క్రిస్టియన్ మతంలోకి మారితే వారు ఎస్సీ రిజర్వేషన్‌ కోల్పోతారని వివరించారు.

వినాయక చవితి సందర్భంగా ఒక గ్రామానికి వెళ్లిన సమయంలో శ్రీదేవిని కొందరు టీడీపీ వ్యక్తులు కులం పేరుతో దూషించారు. దాంతో ఆమె వారిపై ఫిర్యాదు చేయగా ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

దాంతో ఆమె దళితురాలు కాదని.. క్రిస్టియన్ అని…. కాబట్టి అట్రాసిటీ కేసు చెల్లదంటూ కేసును ఎదుర్కొంటున్న వారు కోర్టుకు వెళ్లారు. ఎస్సీ రిజర్వేషన్‌ను ఆమె దుర్వినియోగం చేశారంటూ రాష్ట్రపతి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశారు.

Tags:    
Advertisement

Similar News