ఆ విషయం గురించి నా భర్తనే అడగండి

భర్త వైసీపీ, భార్య బీజేపీలో ఉండడం తగదంటూ వైసీపీ నుంచి దుగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీపై ఒత్తిడి వస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పురంధేశ్వరిని కూడా వైసీపీలోకి తీసుకురావాలని దగ్గుబాటికి జగన్ అల్టీమేటం జారీ చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యవహారం కొద్దిరోజులుగా హాట్ టాపిక్ గా ఉంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి… ఈ వివాదంపై తొలిసారి స్పందించింది. తనకు ఎన్నికలకు ముందే… దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేరినప్పుడే… వైసీపీలో చేరాలని […]

Advertisement
Update:2019-10-29 09:07 IST

భర్త వైసీపీ, భార్య బీజేపీలో ఉండడం తగదంటూ వైసీపీ నుంచి దుగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీపై ఒత్తిడి వస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పురంధేశ్వరిని కూడా వైసీపీలోకి తీసుకురావాలని దగ్గుబాటికి జగన్ అల్టీమేటం జారీ చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యవహారం కొద్దిరోజులుగా హాట్ టాపిక్ గా ఉంది.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి… ఈ వివాదంపై తొలిసారి స్పందించింది. తనకు ఎన్నికలకు ముందే… దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేరినప్పుడే… వైసీపీలో చేరాలని ఆహ్వానం వచ్చిందని పురంధేశ్వరి తెలిపింది. కానీ ఇప్పుడు మాత్రం ఎటువంటి ఆహ్వానం రాలేదని ఆమె వివరణ ఇచ్చింది.

నా భర్త దగ్గుబాటి వైసీపీలో చేరినప్పుడే తామిద్దరం వేరు వేరు పార్టీలలో ఉంటామని… తాను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టంగా వైసీపీ అధిష్టానానికి చెప్పానని పురంధేశ్వరి వివరించింది. అందుకే వైసీపీ నేతలు అంగీకరించిన తర్వాతే… నా భర్త, కుమారుడు వైసీపీలో చేరారని చెప్పుకొచ్చింది.

అయితే ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ మొత్తం వైసీపీలో ఉండాలని ఒత్తిడి వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని.. ఆ విషయం తన భర్తనే అడగాలని పురంధేశ్వరి స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News