అంతా తూచ్...? వంశీ, బాబుల లేఖాయణం
వల్లభనేని వంశీ తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచే తప్పుకుంటానంటూ చంద్రబాబుకు లేఖ రాశారు. అయితే వంశీ ఇదంతా సీరియస్‌గా చేశారా అంటే అనుమానంగానే ఉంది. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించడం, అది కూడా వాట్సాప్‌లో టైప్ చేసి పంపడం ఒక ఎత్తు అయితే… ఆ తర్వాత చంద్రబాబుకు, వంశీ మధ్య సాగుతున్న స్పందనలు చూస్తే ఇదంతా టైం పాస్ వ్యవహారంలా అనిపిస్తోంది. వైసీపీ నాయకులు, అధికారుల వేధింపుల నుంచి అనుచరులను కాపాడుకునేందుకు […]
వల్లభనేని వంశీ తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచే తప్పుకుంటానంటూ చంద్రబాబుకు లేఖ రాశారు. అయితే వంశీ ఇదంతా సీరియస్‌గా చేశారా అంటే అనుమానంగానే ఉంది. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించడం, అది కూడా వాట్సాప్‌లో టైప్ చేసి పంపడం ఒక ఎత్తు అయితే… ఆ తర్వాత చంద్రబాబుకు, వంశీ మధ్య సాగుతున్న స్పందనలు చూస్తే ఇదంతా టైం పాస్ వ్యవహారంలా అనిపిస్తోంది.
వైసీపీ నాయకులు, అధికారుల వేధింపుల నుంచి అనుచరులను కాపాడుకునేందుకు రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు వంశీ లేఖ రాయగా… చంద్రబాబు అందుకు స్పందించారు. అన్యాయం జరిగితే తలదించుకోకుండా పోరాటం చేయాలని వంశీకి సూచించారు.
ప్రభుత్వంపై చేసే పోరాటంలో వ్యక్తిగతంగా, పార్టీ పరంగానూ అండగా ఉంటామని చంద్రబాబు చెప్పారు. వైసీపీ వేధింపులను కలిసికట్టుగా ఎదుర్కొందామని… ప్రభుత్వ విధానాలపై రాజ్యాంగాధిపతులను కలుద్దామని వంశీకి చంద్రబాబు పిలుపునిచ్చారు.
చంద్రబాబు స్పందనకు వంశీ తిరిగి స్పందించారు. చంద్రబాబు స్పందనకు వంశీ స్పందించిన తీరు చూస్తుంటే డ్రామా ఒక కొలిక్కి వచ్చినట్టుగానే అనిపిస్తోంది. అండగా ఉంటానని చెప్పినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు వంశీ. తెలిసో తెలియకో ఎక్కడైనా నా పరిధి దాటి ప్రవర్తిస్తే మన్నించండి అంటూ చంద్రబాబుకు వంశీ విజ్ఞప్తి చేశారు. తన ఆవేదనను చంద్రబాబు అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు వంశీ.
తాను అప్రజాస్వామిక విధానాలపై ఎప్పుడూ పోరాటం ఆపలేదని వంశీ తాజాగా చంద్రబాబుతో చెప్పడం విశేషం. నిన్న అనుచరులను వేధింపుల నుంచి కాపాడుకునేందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పిన వంశీ… ఇప్పుడు తాను అప్రజాస్వామిక విధానాలపై అనేక మార్లు పోరాటం చేశానంటూ గతాన్ని గుర్తు చేసుకోవడం చర్చనీయాంశమైంది.
వంశీ నిజంగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారన్నది నిర్ధారణ కావాలంటే రాజీనామా లేఖను స్పీకర్ కు పంపి దాన్ని ఆమోదించుకుంటే… అప్పుడే ఆయన రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారని నమ్మొచ్చు.